శృతిహాసన్ పై టాప్ హీరో బ్లాక్ మెయిలింగ్

E. Rama Krishna
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ పై ఓ టాప్ హీరో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ న్యూస్ గా వినపడుతున్న ఈ న్యూస్ ను .... ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ నటిస్తున్న మూవీలు అన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. దీంతో శృతిహాసన్ స్టార్ డంతో పాటు, మార్కెట్ వాల్యూ కూడ బాగానే పెరిగింది. అదే విధంగా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ శృతిహాసన్ కు డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన ఓ హీరో, శృతిహాసన్ ను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. తన మూవీలో వెరీ హాట్ ఫోజ్ లతో నటించాలని, అందుకు అగ్రిమెంట్స్ మీద సైన్ చేయాలని తన పై గత కొంత కాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నట్టుగా బిటౌన్ మీడియాలో హాట్ న్యూస్ వినిపిస్తుంది. గతంలో శృతిహాసన్ డి-డే అనే మూవీలో బ్యాక్ బాడీను టాప్ లెస్ గా చూపించి బిటౌన్ ను రెచ్చగొట్టింది. అదే సమయంలో ఇలాంటి మరో బోల్డ్ మూవీకే శృతిహాసన్ సైన్ చేసిందట. తరువాత తను నిర్మాతకు మనీను చెల్లించి, ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ లోని హీరో మాత్రం, శృతిహాసన్ నటించాల్సిందే అంటూ నిర్మాత మీద, హీరోయిన్ మీద బలమైన ఒత్తిడి తీసుకువస్తున్నాడు. లేదంటే లీగల్ గా వెళతానని నిర్మాతను, హీరోయిన్ గా ఉన్న శృతిహాసన్ ను బెదిరిస్తున్నాడు. ఎందుకంటే ఆ హీరో, శృతిహాసన్ హీరోయిన్ గా ఉన్నందుకే ఆ మూవీను చేయటానికి అంగీకరించాడంట. ఇప్పుడు తను కాదనటంతో, అలా కుదరదని గొడవకు దిగుతున్నాడని బిటౌన్ నుండి అందిన సమాచారం. మొత్తానికి ఆ హీరో చేస్తున్న రాద్ధాంతానికి అస్సలు మీనింగే లేదని శృతిహాసన్ అందరికి చెప్పి వాపోతుంది. ఎందుకంటే ఆ హీరో వెనుక బాలీవుడ్ లోని ఓ బలమైన వర్గం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: