రచయితల పై కమల్ షాకింగ్ కామెంట్స్ !

Seetha Sailaja
విలక్షణ నటుడు కమలహాసన్ 60 సంవత్సరాలు వయసుకు దగ్గర పడుతున్నా ఇంకా విలక్షణమైన పాత్రలు చేయడమే కాకుండా తనతో నటించే హీరోయిన్స్ తో లిప్ లాక్ లు చేయడానికి కూడ రెడీ అంటాడు. అటువంటి విలక్షణ నటుడుకి రచయితల పై కోపం వచ్చింది. ఆ కోపాన్ని సెటైర్ గా మర్చి కొద్దిరోజుల క్రితం ముంబాయిలో జరిగిన సినిమా రైటర్స్ వర్క్ షాప్ లో ముఖ్య అతిధిగా పాల్గొని అక్కడకు వచ్చిన బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన కొందరు యువ సినిమా రచయితలను చూసి ఘాటైన సెటైర్లు వేసాడు కమల్. ప్రస్తుతం దక్షిణాదిలోకాని ఉత్తరాదిలోకాని ఉన్న సినిమా రచయితలు అంతా తాము రాసే కధలన్నీ యంగ్ హీరోలను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నారని అంటూ 50 సంవత్సరాలు దాటిపోయిన పెద్ద హీరోలను కూడ పట్టించుకోకుండా రచయితలు అంతా యంగ్ హీరోల చుట్టూ తిరగడం తనకు ఆశ్చర్యంగా ఉంది అంటూ రచయితలను టార్గెట్ చేసాడు కమల్. అంతేకాదు మంచి కధలు తీసుకు వస్తే తాను యంగ్ హీరోలకన్నా ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ కూడ ఇచ్చాడు కమల్. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడ తనకు మంచి కధను ఇచ్చిన రచయితకు కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసాడు అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని బట్టి చూస్తూ ఉంటే హీరోయిన్స్ మాత్రమే కాదు రచయితలు కూడ 50 వయసు దాటిన హీరోలను పట్టించుకోవడం లేదు అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: