డైరెక్టర్స్ తో లాబీయింగ్ చేస్తున్న మారుతి

E. Rama Krishna
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు డైరెక్టర్ మారుతి. మారుతి మూవీ అంటే యూత్ తెగ గోల చేస్తుంది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో 99శాతం థియోటర్స్ లో యూత్ మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే మారుతి ఎంత ప్యామిలీ ఓరియంటెడ్ మూవీలు చేసినప్పటికీ, తను మొదట్లో ఇచ్చిన బూతు మూవీల డోస్, ఇప్పటికీ యూత్ లో అలా ముద్రపడి ఉన్నాయి. అందుకే అల్లరి చేసే యూత్ అంతా మారుతి డైరెక్ట్ చేసిన మూవీకి మొదటి షో కోసం ఉరకలు వేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి, అప్ కమింగ్ డైరెక్టర్స్ తో లాబీయింగ్ లు చేయడం మొదలుపెడుతున్నాడంట. కొత్త దర్శకుడు హరి దర్శకత్వంలో ఇటీవలే విడుదలయి హిట్ టాక్ సొంతం చేసుకుని హౌస్ ఫూల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న “లవర్స్” చిత్రానికి మారుతి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే, ఆ చిత్రంలో ఉన్న మిగతా కామెడీ సీన్స్ ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సప్తగిరి కామెడీ ట్రాక్ మరొక ఎత్తు. సప్తగిరి కామెడీ ట్రాక్ బాగా పేలింది. ఐతే చిత్రంగా, సినిమా విడుదలైన ఇన్ని రోజులకీ, ఆ చిత్ర సమర్పకుడు మారుతి మీడియాతో మాట్లాడుతో బాంబ్ పేల్చాడు. “ఈ పాయింట్ అనుకున్నప్పుడే సప్తగిరి క్యారెక్టర్ అనుకున్నాను. ఆ తర్వాత ఈ షూటింగ్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా నేను వెళ్లి ఆ కామెడీ సీన్స్ ను డైరక్ట్ చేసా. సప్తగరి పిచ్చోడి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని షూట్ చేసేటప్పుడే అనుకున్నాను. అలాగే దర్శకుడు హరి గురించి మాట్లాడుతూ… “హరి క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ పాయింట్ చెప్పినప్పుడే తనలోని కాన్ఫిడెన్స్ ని గమనించాను. ఇక ఈ సినిమా బాగానే తెరకెక్కించినప్పటికీ సప్తగిరి కామెడీ సీన్స్ మాత్రం నేను డైరక్ట్ చేయటం జరిగింది. మిగతా భాగం అంతా తను బాగా తెరకెక్కించాడు.” అన్నాడు. అయితే మూవీ సక్సెస్ అయిన తరువాత ఆ క్రెడిట్ అంతా తనదే అంటూ మారుతి ఈ మధ్య కాలంలో బాగా మాటలు నేర్చాడు. ఒకవేళ మూవీ ప్లాప్ అయితే నేను ఆ మూవీకి కేవలం నిర్మాతగానే వ్యవరించాను అంటూ తప్పించుకుంటాడు. మూవీ సక్సెస్ లో మారుతి క్రెడిట్ తీసుకోవడంతో, ఆ మూవీని నిజంగా డైరెక్ట్ చేస్తున్న దర్శకులకు తరువాత ఆఫర్స్ దొరకడం లేదు. అంతా మారుతి బ్రాండ్ ఎఫెక్ట్ అని అంటున్నారు. మారు ఇంకో అడుగు ముందుకేసి, ఎవరో డైరెక్ట్ చేసిన దానికి అవుట్ పుట్ బాగుంటే తను పేరు వేసుకొని రిలీజ్ చేయటానికి సైతం సిద్ధంగా ఉన్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: