కారు ప్రమాదం నుండి బయట పడ్డ పవన్ కళ్యాణ్ !

Seetha Sailaja
ఈరోజు ఉదయం ఖమ్మంలో వైద్య చికిత్స పొందుతూ తనను చూడాలని కలవరిస్తున్న శ్రీజను కలవడానికి రాజమండ్రి నుండి బయలుదేరిన పవన్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం కొణిజర్ల ప్రాంతంలో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ కు మాత్రం ఎటువంటి పెద్ద గాయాలు తగల లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అయితే పవన్ ప్రయాణిస్తున్న కారుకు బాగా డ్యామేజ్ అవడంతో వేరే కారులో పవన్ శ్రీజను చూడడానికి ఖమ్మం వెళ్ళి శ్రీజను చూడటమే కాకుండా ఆ అమ్మాయి తల్లితండ్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీజ కోసం పవన్ రాజమండ్రిలో కొన్ని బొమ్మలు కూడా కొని శ్రీజకు ఇచ్చాడని మీడియా వర్గాల  ద్వారా తెలుస్తున్న సమాచారం.  ఎటువంటి ప్రమాదం లేకుండా పవన్ బయట పడిన వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా అందరికి ఆనందించ తగ్గ విషయం..   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: