బాద్ షాను డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్

Prasad
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాద్ షా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాలకు కూడా సూపర్ హిట్ డైరెక్టర్స్ ను ఎంచుకుంటున్నాడు. ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు సినిమాకు గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే, ఎన్టీఆర్ అంగీకరించిన మరో చిత్రానికి మరో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఎన్టీఆర్ హీరోగా దుర్గా ఆర్ట్స్ నిర్మించే సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అవుతుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాఖీ అనే సినిమాను దుర్గా ఆర్ట్స్ నిర్మించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: