త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన మహేష్ బాబు

E. Rama Krishna
త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన మహేష్ బాబు! అనగానే కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతానికి ఎటువంటి సినిమాలు లేకపోయినా, ఇప్పడు వీరిద్దరూ కాంబినేషన్ లో ఓ విజువల్ ట్రీట్ బయటకు రాబోతుంది. మేటర్ లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే వీరి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా! అంటూ వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. అయితే ఈ కోరిక ఇప్పట్లో సాధ్య కానప్పటికీ ఒక చిన్న ప్రకటనతో కొంతవరకూ తీర్చనున్నారు. మహేష్ బాబు హైదరబాద్ లోని రెయిన్ బో హాస్పిటల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రెయిన్ బో హాస్పిటల్స్ కోసం మహేష్ బాబు రీసెంట్ గా ఓ యాడ్ లో నటించాడు. అలాగే ఈ యాడ్ ని త్రివిక్రమ్ తో షూట్ చేయిస్తే బాగుంటుందని నిర్వాహకులు అనుకున్నారు. దీంతో ఈ యాడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ యాడ్ ని షూటింగ్ చేయటమే కాకుండా, డిజైన్ చేసింది కూడమన మాటల మరాఠీ త్రివిక్రమ్ శ్రీనివాసే. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ యాడ్ పై హైప్ ని క్రియేట్ చేయటానికి నిర్వాహకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటిసారి మహేష్ తో ఓ యాడ్ తీసిన త్రివిక్రమ్ మహేష్ బాబుని ఎలా చూపించాడో చూడాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీకి పనిచేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేసన్ లో రాబోతున్న మూవీ, షూటింగ్ దశలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: