తమన్నాకు ఊహించని బహుమతి ఇచ్చిన రాజమౌళి !

Seetha Sailaja
టాలీవుడ్ లో తిరిగి తన సత్తా చాటుదామని తమన్నా ఆశలు పెట్టుకున్న ‘ఆగడు’ పరాజయం తరువాత తమన్నాకు మిగిలి ఉన్న ఏకైక ఆశ ‘బాహుబలి’ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి తన దశ తిరుగుతుందని ఆశ పడుతోంది తమన్నా. ఈ సినిమాకు సంబంధించి అనుష్క ప్రధాన హీరోయిన్ అయినా తనకు సంబంధించింది కూడా ప్రధాన పాత్ర కావడంతో మిల్కీ బ్యూటీ ఈ సినిమా గురించి ప్రస్తుతం పగటి కలలు కంటోంది.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ లో పాల్గొంటున్న తమన్నాకు రాజమౌళి ఒక ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ను చూసి తమన్నా కూడా ఆశ్చర్యపోయిందట. ఇంతకీ రాజమౌళి ఇచ్చిన ఆ గిఫ్ట్ విషయం తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్య కలుగుతుంది. దాదాపు ఒక మీటర్ పొడుగు ఉన్న చాక్లెట్ అది. ఆ గిఫ్ట్ ను చూసి ఆనంద పడిన తమన్నా ఆ చాక్లెట్ ఫోటోను తన ట్విటర్ లో పెట్టి అందరికీ తెలిసేలా హడావిడి చేస్తూ కామెంట్స్ పెట్టింది. ‘బల్గేరియాలో సుదీర్ఘమైన ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత పేద్ద చాకొలేట్ ను నా కోసం తెప్పించి ఇచ్చారు. అసలు నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి వన్ మీటర్ చాకొలేట్ ను చూడలేదు’ అంటూ కామెంట్స్ పెట్టింది.  సామాన్యంగా తన సినిమాలలో నటించే నటీనటులకు ఎటువంటి బహుమతులు ఇచ్చే అలవాటు లేని రాజమౌళి నుంచి కూడా తమన్నా గిఫ్ట్ కొట్టేసింది అంటే తమన్నా నటనను చూసి ఎంత ముచ్చట పడ్డాడో అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: