ఆయన నవ్వులు ఆగిపోయాయి - ఎమ్ ఎస్ నారాయణ ఇక లేరు !

Seetha Sailaja

తెలుగు సినిమా రంగాని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రముఖ హాస్య నటుడు ఎమ్. ఎస్. నారాయణ ఇక లేరు. 1951, ఏప్రియల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో పుట్టి రచయితగా మారి ఆ తరువాత నటుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న మైలవరపు సూర్య నారాయణ మరణించడం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు.

700 సినిమాలలో నటించి మెప్పించిన ఎమ్. ఎస్. నారాయణ 5 నంది అవార్డులు అందుకున్న ప్రముఖ కమెడియన్. తెలుగు సినిమా రంగంలో తాగుబోతు పాత్రలకు ట్రెండ్ సెటర్ గా ఎమ్ ఎస్ తనదైన శైలిని ఏర్పరుచుకున్నారు.

వివాదాలకు అతీతంగా అందరికీ నచ్చిన వ్యక్తిగా మంచి నటుడిగా, హాస్యాన్నే కాదు ఎటువంటి పాత్రకైనా తన నటనతో జీవం పోశారు.

టాలీవుడ్ లో నటుడిగా ఆయన మొదటి సినిమా ఎమ్ ధర్మరాజు ఎమ్ ఏ నుండి ఎన్నో వందల పాత్రలను నటించడమే కాకుండా గిన్నిస్ బుక్ కు కూడా ఎక్కిన ఎమ్ ఎస్ నారాయణ చనిపోవడంతో తెలుగు సినిమా రంగ నవ్వులు ఆగిపోయాయి అని అనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: