జీరో సైజ్ కోసం అనుష్క తంటాలు..?!!
అనుష్క అందాలకు కేరాఫ్ అడ్రాస్.. ఈ మధ్య కాలంలో అనుష్కకు తెగ కలిసి వస్తుందనే చెప్పొచ్చు. కొత్తలో తెలుగు ఇండస్ట్రీలో అంతగా రాణించక పోయినా విక్రమార్కుడు సినిమాతో గ్లామర్ రోల్ పోషించి అమ్మడు అందరినీ తనవైపు తిప్పుకుంది.
యోగా చేస్తూ తన బాడీని కంట్రోల్ లో పెట్టుకునే ఈ చిన్నది మంచి పర్సనాలిటీ మేయిటేన్ చేస్తూ ఏ సినిమాకైనా ఆయా పాత్రకు తగ్గట్టుగా తీర్చి దిద్దుకుంటుందంట.? ఆ మద్య వచ్చిన అరుంధతి నుంచి ఈ మధ్య వస్తున్న రుద్రమదేవి, బాహుబలి చిత్రాల పాత్రలకు తగ్గట్టుగా తయారై చూపరులను ఇట్టే ఆకర్శించ గలిగింది ఈ బొమ్మాలి.
ఈ మధ్య నే మరో సినిమా ప్రాజెక్టు ఓకే చెప్పేసింది అనుష్క ఆ సినిమానే ‘జీరో సైజ్’. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. అయితే ఈ సినిమా హీరోయిన ఓరియెంటెడ్ కాబట్టి అనుష్క చాలా వేరియేషన్లో కనబడనుందట..? మరి దీని కోసం అనుష్క 20 కేజీల వెయిట్ పెరుగుతోంది.
ప్రస్తుతం అనుష్క ఈ సినిమా కోసం వెయిట్ పెరిగే పనిలో ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. విచిత్రమేమిటంటే సినిమా టైటిల్ చూస్తే ‘జీరో సైజు’ మని అనుష్క పర్సనాలిటి చూస్తే లావెక్కేలా ఉంది రెంటింటికీ పోంతనేంటా అని జుట్టు పీక్కుంటున్నారు సినీ ప్రేమికులు. ఏదైమైనా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అనుష్క ఏంచేసినా హిట్టే.