హాట్ న్యూస్ గా మారిన త్రివిక్రమ్ అలవాట్లు !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఉన్న ఒక విచిత్రమైన అలవాటు పై ఇప్పుడు ఫిలింనగర్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలను పరిశీలించి విశ్లేషకులు ఈకామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ అలవాటును తన హీరోయిన్స్ విషయంలో ‘జల్సా’ సినిమా నుండి అనుసరిస్తూ వస్తున్నాడు.
‘జల్సా’ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానాను బ్రెయిన్ లెస్ బ్యూటీగా చూపించడమే కాకుండా ప్రతి విషయంలోనూ 10 సెకండ్లు ఆలస్యంగా స్పందించే విచిత్రమైన వ్యక్తిగా ఇలియానాను చూపెట్టాడు త్రివిక్రమ్. ఆ తరువాత ‘ఖలేజా’ సినిమాలో అనుష్కను ఐరన్ లెగ్ బ్యూటీగా చూపెట్టి ఆమె పై మహేష్ చేత విపరీతమైన సెటైర్లు వేయిoచాడు.
ఈసినిమా పరాజయం తరువాత త్రివిక్రమ్ తీసిన ‘జులాయి’ సినిమాలో ఇలియానాను పంటికి క్లిప్పులతో కంటికి అద్దాలతో గ్లామర్ లేకుండా చూపెట్టి హిట్ సాధించాడు. ఇక తనను సూపర్ డైరెక్టర్ మార్చిన పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంతను షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషంట్ గా మార్చి టాలీవుడ్ కలక్షన్స్ రికార్డు క్రియేట్ చేసాడు.