చిరంజీవి, మోహన్ బాబులపై లెజెండ్ సెటైర్లు...

Chakravarthi Kalyan


లెజెండ్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించింది. కర్నూల్‌ జిల్లాలోని ఎమ్మిగనూరులో లెజెండ్‌ సినిమా 400 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వేసిన సెటైర్లు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. 


చిరు, మోహన్ బాబులకు షాక్.. 


తెలుగు సినిమా చరిత్రలో ఎవరు లెజెండ్ అన్న విషయంపై కొద్దికాలం క్రితం కొందరు కొట్టుకున్నారు.. అసలైన లెజెండ్ ఎవరో తెలుసా.. మా నాన్నగారే.. ఇక ఆయన తర్వాత మళ్లీ అంతటి స్థాయి నాదే... అందుకే తెలుగు సినిమా చరిత్రలో లెజెండ్ నేనే అంటూ డైరెక్టుగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 


మానాన్న.. నేనే లెజెండ్స్ 



తెలుగు సినిమా స్వర్ణోత్సవాల సందర్భంగా లెజెండ్, సెలబ్రెటీ అవార్డుల విషయంలో చిరంజీవి, మోహన్ బాబుల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో చిరంజీవికి లెజెండ్, మోహన్ బాబుకు సెలబ్రెటీ హోదా ఇచ్చారు. దానిపై స్వర్ణోత్సవ వేదికపైనే మోహన్ బాబు విమర్శలు చేశారు. తాను సెలబ్రెటీ ఏమిటి.. తానే లెజెండ్ నని ప్రకటించుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లు బాలయ్య ఆ తెనెతుట్టెను కదిపారు. దీని రియాక్షన్స్ ఎలా ఉంటాయో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: