పవన్ ‘కల్కి’గా రాబోతున్నాడా..?!!
దర్శక రత్న దాసరి నారాయణ రావు, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాంబినేషన్లో సినిమా వస్తుందని గతంలో సోషల్ నెట్ వర్క్ లో వార్తలు గుప్పుమన్నాయి. దానికి కార్యరూపం దాల్చబోతున్నట్టు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘కల్కి' అనే టైటిల్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ 2 చిత్రం ఈ నెలాఖరున ప్రారంభం కానున్నది. ఈ సినిమా అయిపోయిన వెంటనే దాసరి చిత్రంలో నటించబోతున్నన్నట్లు తెలుస్తుంది.