కూతురు కోసం మామిడికాయలు తెంపుతున్న సూపర్ హీరో..!!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ స్టార్ గా వెలిగిపోయిన రాజేష్ ఖన్నా ముద్దుల కూతురు ట్వింకిల్ ఖన్నా, భర్త కరాటే కింగ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ఈ సమ్మర్ లో ఫుల్ ఎంజాయ్ మెంట్ లో ఉన్నాడు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి షూటింగ్ లు కాస్త తక్కువే ఎందుకంటే ఔట్ డోర్ షూటింగ్ లో ఎండ పంబరేపుతుంది కాబట్టి సాధారణంగా విదేశాల్లో షూటింగ్ లు చేసుకుంటారు అలా లేకపోతే ఇంట్లో హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతారు, ప్రస్తుతం అక్షయ్ కుమార్ అదే పనిమీద ఉన్నాడు.  


మామ రాజేష్ ఖన్నా, భార్య ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్


తన చిన్న కుమార్తె నిటారాతో కలిసి చెట్టుకి ఉన్న మామిడి కాయలు కోశారు. ఇలా చెట్టు కాయలు కోస్తుంటే తన చిన్నతనంలో చేసిన చిలిపి పనులు గుర్తుకొస్తున్నాయి అని అక్షయ్ అంటున్నాడు. అక్షయ్‌ ఫొటోను ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా ఈరోజు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు, అంతే కాదు ఇద్దరు భార్యాభర్తలు ట్విట్టర్ బాగానే ఫోలో అవుతారు.. ట్వింకిల్ ఖన్నా మంచి భార్యగా, మంచి తల్లిగా సూపర్ ఉమెన్  అంటూ మెచ్చుకుంటాడు అక్షయ్ కుమార్.. మా ఆయన బంగారం అంటూ ట్వింకిల్ కితాబిస్తుంది. కాగా ట్వింకిల్ ఖన్నా 2001లో అక్షయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పింది. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. 

ట్వింకిల్ ఖన్నా ట్విట్

Revisiting our own childhood. Plucking mangoes and seeing the wonder in her eyes.. pic.twitter.com/KXvJuaCbda

— Twinkle Khanna (@mrsfunnybones) May 27, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: