బాహుబలి ఆడియో వాయిదా వెనుక ప్రముఖ నిర్మాత హస్తం ?

Seetha Sailaja



‘బాహుబలి’ ఆడియో విడుదల వాయిదాకు రాజమౌళి మీడియా ముందుకు వచ్చి రకరకాల కారణాలు చెప్పినా ఈ వాయిదా వెనుక అసలు కారణం వేరు అంటూ  ఫిలింనగర్ లో వార్తలు వినిపడుతున్నాయి. గ్రౌండ్ కెపాసిటీ మించి ఫ్యాన్స్ వస్తారని తెలియడంతో  ప్రస్తుతానికి ఫంక్షన్ వాయిదా వేశామని యూనిట్ అంటున్నా అసలు కథ మాత్రం ఈ సినిమా  ట్రైలర్ అంచనాలకు తగ్గట్టు లేకపోవడమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ముందుగా అనుకున్నట్టు 31న ఆడియో రిలీజ్ చేసి జూన్ 1న ముంబైలో హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్నాడు రాజమౌళి. కానీ  బాలీవుడ్‌లో రిలీజ్ చేయబోతున్న టీజర్ హిందీ వెర్షన్ ను ప్రెసెంట్ చేస్తున్న కరణ్ జోహార్‌కు ఈ టీజర్ అంతగా నచ్చలేదని అని అంటున్నారు. అదేవిధంగా 3 వెర్షన్స్‌లో ట్రైలర్స్ రెడీ అయినా అవి ఏవీ కూడా ‘బాహుబలి’ క్రేజ్ కు రీచ్ అయ్యేలా లేవు అని రాజమౌళి ఆఖరి నిమిషంలో భావించడంతో ఈ వాయిదా పడింది అని అంటున్నారు. 

అంతే కాకుండా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ తదుపరి డేట్ గురించి అదే విధంగా ఆ సినిమా విడుడుదల తేదీ మారుతుందా  అని అడిగినప్పుడు ‘బాహుబలి’ విషయంలో తాను అనుకున్నట్లుగా ఏది జరగటం లేదు అని రాజమౌళి స్పందించడం బట్టి రాజమౌళి బయటకు చెప్పలేని కారణాలు ఇంకా చాలా ఉన్నాయి అనే మాటలు వినపడుతున్నాయి. అయితే గతంలో  హైదరాబాద్ లో చాలా భారీ భారీ సభలు జరిగాయి. లక్షల్లో జనం వచ్చారు వాటికన్నా గొప్ప ఫంక్షన్ ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ కాదు కదా అని కొందరు మీడియా ప్రతినిధులు నిన్నటి ‘బాహుబలి’ మీడియా సమావేశం అయిపోయిన తరువాత సెటైర్లు వేసినట్లు టాక్. 

దీనికి తోడు ఈ సినిమా ఆడియో ప్రత్యక్ష ప్రసార హక్కులను టీవీ 5 ఛానల్ కు ఇవ్వడంతో అనుకోని ఈ పరిణామానికి షాక్ అయిన మిగతా పోటీ ఛానెల్స్ పోటీ తత్వoతో ‘బాహుబలి’ ట్రైలర్ లో ఏమాత్రం లోపాలు కనిపించినా ఆఅవకాశాన్ని వదులు కోకుండా ‘బాహుబలి’ టీజర్ పై నేగిటివ్ కామెంట్స్ చేస్తారు అన్న భావంతో మళ్ళీ  ఒకటికి పది సార్లు  ‘బాహుబలి’ టీజర్ విషయంలో మనసు పెట్టి మార్పులు చేసిన తరువాత మాత్రమే  జనం వద్దకు వెళ్ళదామన్న రాజమౌళి ఆలోచన ఈ వాయిదాకు కారణం అనే మాటలు కూడ వినపడుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: