‘గబ్బర్ సింగ్ 2’ సినిమా షూటింగ్ షూరూ..!!

Edari Rama Krishna

తెలుగు చలన చిత్ర అభిమాన నటుడు పవన్ కళ్యాన్ తెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ కొండంత ఆశతో ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్త.. !! అవునండి పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా షూటింగ్ మొదలైంది.  పూణేలోని ఓ చిన్న గ్రామంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఇక ఎక్కడా వాయిదాలు వేయకుండా షరవేగంగా పూర్తి చేయడానికి అంతా సంసిద్దం చేసుకున్నారు దర్శక, నిర్మాతలు.


గబ్బర్ సింగ్ 2 ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ నటించనున్న ఫుల్ లెంగ్త్ సినిమా ‘గబ్బర్ సింగ్ 2′ అన్న విషయం తెలిసిందే! ఈ సినిమాకు రవితేజకు ‘పవర్’ సినిమాతో మంచి హిట్ అందించిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా బాబీ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని పవన్ కళ్యాన్ తో సినిమా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని ట్విట్ లో పేర్కొన్నాడు. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. 

డైరెక్టర్ బాబీ ట్విట్

Even Iam waiting for this day !!! Gs2 starts...Big day thanks to our power star !!! pic.twitter.com/W4xsUYlED5

— bobby (@dirbobby) May 29, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: