రచయితలతో రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్

E. Rama Krishna
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ మూవీకి సంబంధించని లేటెస్ట్ అప్ డేట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకూ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఏ విషయాలను బయటకు చెప్పకపోయినా, చిత్ర యూనిట్ ద్వారా బయటకు వస్తూనే ఉన్నాయి.


అయితే, ముఖ్యంగా కోనవెంకట్, రామ్ చరణ్ మూవీకి సంబంధించిన  విశేషాలను ఏదొక సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. కోనవెంకట్ ఇలా మూవీ విశేషాలను బయటకు చెప్పటానికి వెనుక రామ్ చరణ్ ఉన్నాడని అంటున్నారు. రామ్ చరణ్ మూవీకి హైప్ క్రియేట్ అవ్వాలంటే అది కచ్ఛితంగా విలువగల రచయితలు చెబితేనే వింటారు.


ఇక రామ్ చరణ్ మూవీపై కోన వెంకట్ ఏమన్నాడంటే


అందుకే రామ్ చరణ్, కోనవెంకట్ తో తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన విశేషాలను చెప్పిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ మూవీపై కోన వెంకట్ ఏమన్నాడంటే, “చరణ్ సినిమాకు అన్నీ శుభ పరిణామాలే జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వస్తోంది. దిష్టి తగులుతుందని కొన్ని ఆసక్తికర విషయాలని ఇప్పుడే చెప్పదల్చుకోలేదు” అని తెలియజేస్తూ రచయిత కోన వెంకట్ ఓ ట్వీట్ చేయడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.


ఆ ఆసక్తికర అంశాలు ఏమై ఉంటాయనే దానిపై అభిమానులు ఇప్పటికే ఆలోచనల్లో పడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: