ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా వస్తే చాలు దానిపై రక రకాల పేరడీలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ హీరో స్థానంలో కామెడీ యాక్టర్ల ఫోటోలు.. ఇతరుల ఫోటోలు పెట్టి మార్పింగ్ చేసి అవి ఫేస్ బుక్ లో గుగుల్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ మద్య వచ్చిన బాహుబలి చిత్రానికి సంబంధించి ఎన్నోరకాల ఫన్నీ ఫోటోలు సోషల్ నెట్ వర్క్ లో దర్శనమిచ్చాయి. ఇక యూట్యూబ్ లో అయితే పెరడీలకు కొదవేలేదు అంతే కాదు వాటికి లైక్స్ కూడా విపరీతంగా వచ్చేస్తున్నాయి.
శ్రీమంతుడు పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యేదే ఆలస్యం.. వెంటనే కమెడియన్లతో వాటికి స్పూఫ్ రెడీ చేయడం అలవాటుగా మారింది కొందరికి. తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం ఒక కామెడీ ట్రెడ్ మార్క్ ఈయన లేని చిత్రాలు ఉంటవంటే అతిశయోక్తి లేదు. అంతే కాదు బ్రహ్మానందానికి సంబంధించిన పేరడీ ఫోటోలు..సీన్లు సోషల్ నెట్ వర్క్ లో బొలెడన్ని ఉంటాయి. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్ బ్రహ్మానందంపై తీశారు. మహేష్ బాబు శ్రీమంతుడు అయితే బ్రహ్మ ధనవంతుడు అంటూ ట్రెలర్ లో మహేష్ బాబు చెప్పె డైలాగ్స్ బ్రహ్మి వాయిస్ ను సింక్ చేస్తూ రెడీ చేసిన ధనవంతుడు స్పూఫ్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఒక్కసారి చూసి నవ్వేసుకుందామా..!