బాలీవుడ్ లో సంచలనాన్ని సృట్టిస్తున్న ప్రభాస్ పెళ్ళి వార్తలు ?

Seetha Sailaja


ఒక వైపు ‘బాహుబలి2’ షూటింగ్ సెప్టెంబర్ మధ్యనుండి ప్రారంభం అవుతుంది అని రాజమౌళి సంకేతాలు ఇస్తూ ఉంటే బ్రభాస్ పెళ్ళిని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో కధనాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కధనాలు వింటూ ఉంటే నిజమా అని అనిపించే డట్లుగా వార్తలు ఉన్నాయి. 

‘బాహుబలి’ బాలీవుడ్ లో కూడ ఘనవిజయం సాధించడంతో ముంబాయి మీడియాదృష్టి ప్రభాస్ పై బాగాపడింది. పెళ్ళికాని బాలీవుడ్ హీరోల ప్రేమ, పెళ్ళి, డేటింగ్ విషయాలపై వార్తలు రాయకుండా బాలీవుడ్ మీడియాకు రోజుతెల్లవారదు. ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు ప్రభాస్ అటవస్తువుగా దొరికాడు.

బాలీవుడ్ మీడియా వార్తలప్రకారం ప్రభాస్ నిశ్చితార్ధం డిసెంబర్ లో జరగబోతోంది అంటూ గాసిప్పులు వ్రాస్తోంది. అంతేకాదు ప్రభాస్ ను పెళ్ళిచేసుకోబోయే అమ్మాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ఆఅమ్మాయి వయస్సు 25 సంవత్సరాలలోపు అని అంటూ కథనాలు క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ సామజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రభాస్ కు కాబోయే భార్య అంటూ తెరపైకి ఒక కథనాన్ని తీసుకు వచ్చింది ముంబాయ్ మీడియా. 

డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగిన తరువాత ‘బాహుబలి 2’ షూటింగ్ పూర్తి అయిన మరుక్షణం వచ్చేసంవత్సరం మధ్యలో ప్రభాస్ పెళ్ళి జరుగుతుందని ముంబాయి మీడియా ఊహిస్తోంది. ఆమధ్య ప్రభాస్ పెళ్ళి గురించి టాలీవుడ్ మీడియాలో గాసిప్పులు వచ్చాయి. అయితే ఆతరువాత అవన్నీ సద్దుమణిగాయి. ఆవార్తలకు కొనసాగింపుగా బాలీవుడ్ మీడియా ఈవార్తలను ప్రచారం చేస్తోందా? లేదంటే ఏమైనా స్పష్టమైన సంకేతాలు వారికి తెలిసాయా అన్న వషయంపై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ పై మీడియా ఈవిధంగా దృష్టిపెట్టడం ఆశ్చర్యకరం..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: