ఆ హీరో ట్విట్టర్ హ్యాక్ చేశారు.. బూతు సైట్లు పెట్టారు..!!

Edari Rama Krishna
హ్యాకింగ్ చేసేవాళ్లకు సెలబ్రెటీల అకౌంట్స్ హ్యాక్ చేయడం సర్వ సాధారణమైంది.  ప్రముఖ బాలీవుడు నటుడు అమితాబ్ కు హ్యాకర్లు సత్తా చూపారు. దేన్నైనా , ఎవరి అకౌంట్ అయినా హ్యాకింగ్ చేయగలమని మరోసారి నిరూపించారు.  తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. అమితాబే స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు. హ్యాకింగ్ చేసిన ట్విట్టర్ ఖాతాలో అశ్లీల వీడియోలను అప్ లోడ్ చేసారని తెలిసింది.

బాలీవుడ్‌లో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, బ్లాగ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తన అనుభవాలు, అభిప్రాయాలను, సినీ విశేషాలను అభిమానులతో ఎక్కువగా పంచుకుంటుంటారు అమితాబ్‌ బచ్చన్‌. 44 వేలమందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్న బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయ్యింది.ఇది కేవలం బిగ్‌ బీకే కాదు. చాలా మంది సెలబ్రిటీలకు ఈ సెగ తగిలింది. గతంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలా మందికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

అమితాబచ్చన్


మన దగ్గర టాలీవుడ్‌ హీరోలు మహేష్‌బాబు, రానా ఎకౌంట్స్‌ హ్యాక్‌ అయ్యాయని వాళ్లే చెప్పారు. సో, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో జాగ్రత్తగా ఉండాలని సెలబ్రిటీలే సెలవిస్తున్నారు. లేకపోతే, పర్సనల్ మ్యాటర్ గల్లంతైపోతుంది.  ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ 'నా ట్విటర్‌ అకౌంట్‌ను సెక్స్‌ సైట్లకు సంబంధించిన వారే హ్యాక్‌ చేశారు. ఆ సైట్లను అనుసరించే అకౌంట్ల పరిధిలోకి నా ట్విట్టర్‌ ఖాతా వెళ్లిపోయింది. ఈ అవ సరం నాకైతే లేదు. ఎవరో కొందరు ఈ పని చేసి ఉండొచ్చు'' అని పేర్కొన్నారు.

అమితాబచ్చన్ ట్విట్స్ : 

T 1980 -WHOA !..My Twitter handle hacked ! Sex sites planted as 'following' ! Whoever did this, try someone else, buddy, I don't need this !

— Amitabh Bachchan (@SrBachchan) August 31, 2015 T 1980 - OKAAY .. !! Plot thickens ! Had been getting several really dirty abusive sms for a year .. just handed all of them to the POLICE !

— Amitabh Bachchan (@SrBachchan) August 31, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: