కేసీఆర్ కి అల్లు అర్జున్ థ్యాంక్స్..!!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాలు తీసిన దర్శక,నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ‘రుద్రమదేవి’.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో థియేటర్లోకి రావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పదే పదే పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు నేడు విడుదల అవుతుంది. రుద్రమదేవి కాకతీయుల ప్రజలకోసం చేసిన త్యాగాలను , 40 ఏళ్లపాటు ఆరోజుల్లో ఓస్త్రీ అయిన ఆమె పరిపాలించిన విధానాన్ని ఈ సినిమాలో చూపించామన్నారు.  ఇప్పటి వరకు చారిత్రాత్మక చిత్రాలు వచ్చినప్పటికీ కాకీయుల చరిత్రపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన చిత్రం ‘రుద్రమదేవి’.

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు ఈమె చరిత్రను నిశితంగా పరిశోదించి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అనుష్క ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు దర్శక, నిర్మాత గుణశేఖర్. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  చిత్ర దర్శకుడు గుణశేఖర్‌, ఆయన భార్య, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తదితరులు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే.   దీనికి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

కాకతీయ వీరవనిత రుద్రమదేవి గొప్పదనాన్ని చిత్రంగా తీసినందుకు గుణశేఖర్‌ను కేసీఆర్‌ అభినందించారు. రుద్రమదేవి లాంటి చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డిగా నటించిన అల్లు అర్జున్  'రుద్రమదేవి' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంపై హీరో అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ఇలా చారిత్రాత్మక చిత్రాలకు పన్ను మినహాయింపు ఇవ్వడమనేది సీఎం ఔన్నత్యానికి, మంచి తనానికి గుర్తింపు అని కొనియాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన గుణశేఖర్, దిల్ రాజు


కాకతీయుల కాలంనాటి చిత్రం కావడం తెలంగాణ ప్రజలు తప్పకుండా చూడాలని ఒక వీర వనిత గాధ మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు అల్లు అర్జున్..ఇక మహబూబ్ నగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజల కోసం పోరాటం జరిపిన యోధుడు ‘గోన గన్నారెడ్డి’ పాత్ర గురించి కూడా అద్భుతంగా చూపించారని ఈ సినిమా చూస్తే ఆయన త్యాగం, పోరాటం ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. తెలంగాణ సీఎం చంద్ర శేఖర్ రావు  'రుద్రమదేవి' చిత్రానికి  పన్ను మినహాయింపు ఇవ్వడంపై హీరో అల్లు అర్జున్  తన ట్విట్టర్ లో  హర్షం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ ట్విట్ : 

I Thank the Hon.CM of Telangana State KCR garu for being Generous by exempting the Entertainment Tax for Rudramadevi Movie

— Allu Arjun (@alluarjun) October 8, 2015Rudramadevi movie Releasing Tomorrow ! The First Real 3D movie. Hope you all like the Movie and my New attempt !

— Allu Arjun (@alluarjun) October 8, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: