దక్షిణాఫ్రికాలో ‘మనబడి’ ...!!

Shyam Rao

 దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో ఫిబ్రవరి 5న సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మనబడి కార్యక్రమం ప్రారంభమయింది. ఈ సందర్భంగా భారత కాన్సలేట్‌లో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాయబారి సురేష్‌కుమార్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. గత రెండు సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం వారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.సిలికానాంధ్ర మనబడి అభివృద్ధి శాఖ ఉపాధ్యక్షుడు శరత్‌ ప్రసంగిస్తూ కార్యక్రమ వివరాలను తెలిపారు.



నూతన విద్యాసంవత్సరానికి అనేక మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సీతారామరాజు రాపోలు, ఇందిరాలింగం, పవన్‌ అట్లూరి, శ్వేత బొల్లోజు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి దక్షిణాఫ్రికా మనబడి సమన్వయకర్త సతీష్‌ పొణుగుపాటి సహకారం అందించారు. కీర్తిక పొణుగుపాటి వందనసమర్పణతో కార్యక్రమం ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: