“భారతీయలకి” అమెరికా పై మోజు తగ్గింది.. “యుఎస్ ఇమ్మిగ్రేషన్”
భారతీయులని అమెరికా రాకుండా నిలువరించడానికి అమెరికా చేయని ప్రయత్నాలు లేవు వీసాల విషయంలో సరికొత్త నిభందనలు పెడుతూ భారతీయులని అమెరికా వైపు చూడకుండా చేయడంలో యూఎస్ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు..అంతేకాదు హెచ్1బి వీసాపై అమెరికాలో పనిచేసే వారి జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ (హెచ్-4 వీసా)ను రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ఆలోచిస్తోంది. కానీ ఆ నిర్ణయంతో భారతీయులతోపాటు ఇతర దేశ వృత్తి నిపుణులకు అమెరికా పట్ల మోజు తగ్గవచ్చని యుఎస్ ఇమ్మిగ్రేషన్ సలహా మండలి అభిప్రాయపడింది.
హెచ్1బి వీసాపై అమెరికా వెళ్లేవారిలో భారతీయులే అత్యధికం అనేది అందరికీ తెలిసిన విషయమే..గ్రీన్‌కార్డు (శాశ్వత నివాస హక్కు) పొందే ప్రయత్నాల్లో ఉన్న హెచ్1బి హోల్డర్ల భాగస్వాములు కూడా పనిచేసేందుకు 2015లో ఒబామా ప్రభుత్వం వీలుకల్పించింది. కానీ ఈ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అలా చేస్తే కుటుంబ పోషణలో వారి జీవిత భాగస్వాములను పాలుపంచుకోనీయకుండా చేసినట్లవుతుందని, దాంతో విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పనిచేయాలన్న ఆకాంక్ష తగ్గిపోవచ్చని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ అభిప్రాయపడింది.
ఈ కౌన్సిల్ వద్దనున్న గణాంకాల ప్రకారం.. 2015 నుంచి ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం 1.05 లక్షల మందికి హెచ్-4 వీసాలు జారీ చేసింది. అందులో 90 శాతం భారతీయులే. వీరికి హెచ్1బి వీసా హోల్డర్లలకు మాదిరిగా ఎలాంటి ఆంక్షలుండవు. అంటే, హెచ్-4 వీసా పొందిన వారు ఏ కంపెనీ, వ్యాపార యజమాని వద్దనైనా పనిచేయవచ్చు...హెచ్1బి వీసాపై పనిచేస్తున్న వారి దాంపత్య భాగస్వాములకు వర్క్ పర్మిట్ వెసులుబాటును ఉపసంహరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.