“భారతీయ సిక్కు” లు అమెరికాలో “రికార్డు” సృష్టించారు..

Bhavannarayana Nch

ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారతీయుల ప్రతిభ మారుమోగుతూనే ఉంటుంది..భారతీయులు ఎక్కడ ఉన్నా సరే ఎదో ఒక రంగంలో గుర్తింపు తెచ్చుకుంటారు..అగ్రరాజ్యం అమెరికాలో మేయర్స్ గా..సెనేటర్స్ గా, ఏకంగా ప్రభుత్వంలోనే ఉన్నతమైన పదవులని పొందిన వారు కూడా ఉన్నారు అయితే తాజాగా అమెరికాలో ఉన్నసిక్కులు గిన్నిస్ రికార్డు సృష్టించారు..వేలాది మంది కలిసి గిన్నిస్ రికార్డు పరాయి గడ్డపై సృష్టించడం ఇదే ప్రప్రధమం..ఇంతకీ భారత సిక్కు ఎన్నారైలు సాధించిన గిన్నిస్ రికార్డు ఏమిటి ఏ సందర్భంలో ఈ అవార్డు వచ్చింది అనే వివరాలలోకి వెళ్తే..

 


తలపాగా దినోత్సవం సందర్భంగా వేలాది మంది సిక్కులు ఒకేసారి ఒకే సారి తలపాగాలు ధరించి అమెరికాలో గిన్నిస్ రికార్డు సృష్టించారు...జాతి విద్వేష దాడులకు వ్యతిరేకంగా అమెరికన్లు, ఇతర జాతీయులకు తలపాగాలపై అవగాహన కల్పించడంలో భాగంగా న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద దాదాపు 9 వేల మంది సిక్కులు ఒక్కసారిగా అందరూ కలిసి తలపాగాలు ధరించారు. మొత్తం 8 గంటల్లో వీరంతా తలపాగాలు ధరించి గిన్నిస్ బుక్‌ రికార్డు సాధించారు.

 

అయితే ఈ తలపాగా దినోత్సవాన్ని ఏప్రిల్ నెల మధ్యలో నిర్వహించే వైశాఖిని  సందర్భంగా నిర్వహిస్తారు సిక్కులు..కేవలం కొన్ని గంటల సమయంలోనే దాదాపు  9 వేల మంది తలపాగాలు ధరించడం ఎంతో సంతోషంగా ఉందని ఓ ఎన్జీవో వ్యవస్థాపకుడు సంతోషం వ్యక్తం చేశారు..అయితే ఈ సంస్కృతిని సిక్కులు 2013 నుంచీ పాటించడం గమనార్హం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: