“ఏపీ ఎన్నారై” విద్యార్ధికి “ఏజీ స్కాలర్” అవార్డు

Bhavannarayana Nch

ప్రతిభ కలిగిన వాళ్ళు ఎటువంటి రంగంలో అయినా రాణించగలరు..అందులోనూ  భారతీయ విద్యార్ధుల ప్రతిభ కి కొలమానం కూడా ఉండదు..ప్రపంచ వ్యాప్తంగా ఎవరితో అయినా, ఏ దేశం వారితో అయినా పోటీ పడుతూ చదవగల సత్తా ఉన్న వాళ్ళు భారతీయులు..వివిధ దేశాలలో ఉన్నత చదువులకి వెళ్ళే భారతీయ విద్యార్ధులు అక్కడ చూపించే ప్రతిభా పాటవాలు భారతీయులు ప్రతీ ఒక్కరికీ సంతోషాన్ని అందిస్తాయి..తాజగా ఏపీలో బాపట్ల కి చెందినా కుర్రాడు ఓ అధ్బుతమైన ఘనత సాధించాడు..వివరాలలోకి వెళ్తే...

 

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన రోహిత్‌ వుల్చి....పెట్రుస్సీ విటి కల్చర్‌ బిల్డింగ్‌లో కాలిఫోర్నియా 23వ డిస్ట్రిక్ట్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిమ్‌ పాట్టర్‌సన్‌ చేతుల మీదుగా ఏజీ స్కాలర్‌ అవార్డు అందుకున్నారు. రోహిత్‌తో పాటూ కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలోని జోర్డాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ఆంథోని మెలే, ఆల్డో గార్సియా, ఎమ్మా జచారియస్‌లు ఏజీ స్కాలర్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

 

రోహిత్ ఏపీలోని బాపట్ల లో అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన తర్వాత అమెరికాలోని  కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో అగ్రికల్చరల్‌ విభాగంలో మాస్టర్స్‌ చేస్తున్నారు...ఈ దశలోనే ఆల్మండ్‌, పిస్తాపప్పు మొక్కలకు హాని కలిగించే లెపిడోపెటెరాన్‌ నాలుగు రెక్కల పురుగుని అత్యంత తక్కువ ఖర్చుతో సంహరించడం ఎలా అనే విషయంపై రీసెర్చ్‌ చేస్తున్నారు. యూసీ కెర్నీ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌లోని ఎంటమాలజీ లాబొరేటరీలో రీసెర్చ్‌ టెక్నీషియన్‌గా కూడా రోహిత్‌ పని చేస్తున్నారు.

 

ఈ అవార్దు అందుకున్న విషయంపై రోహిత్ తల్లి తండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..రోహిత్‌ తండ్రి కృష్ణ మోహన్ కొత్త గూడెం జిల్లా అశ్వరావు పేటలో అగ్రికల్చరల్‌ విభాగానికి చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఏరియా సేల్స్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు...తండ్రి కూడా అగ్రికల్చర్ విభాగంలోనే పని చేయడం కొడుకు మొక్కల సంరక్షణ రీసెర్చ్ కోసం కాలిఫోర్నియా వెళ్లి తన ప్రతిభని చాటడం ఎంతో సంతోషం గా ఉందని అంటున్నారు రోహిత్ స్నేహితులు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: