“గల్ఫ్” లో మోసపోయిన “22” మంది విశాఖ వాసులు..

Bhavannarayana Nch

నకిలీ వీసాలు..నకిలీ ఉద్యోగాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పించుతామని చెప్పి ఎన్నో రకాల మోసాలు జరుగుతూనే వస్తున్నా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే వారు ఎక్కడా  కనిపించడం లేదు రోజుకో మోసం బయట పడుతున్నా సరే అవగాహన లేకపోవడం గుడ్డిగా నమ్మేయడం లాంటి పనుల వలన ఎంతో మంది మోసపోతున్నారు అయితే తాజాగా విశాఖ వాసులకి ఇలాంటి చెడు అనుభవమే ఎదురయ్యింది..

 

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది విశాఖ వాసులు గల్ఫ్ వెళ్లి అక్కడ అనుకున్న ఉద్యోగాలు దొరకక మోసపోయారు..కొరియా కంపెనీ లో ఉద్యోగాలు ఇప్పించుతామని చెప్పి భారీగా డబ్బు వసూలు చేసి తీరా దుబాయి వెళ్ళిన తరువాత వారిని చిన్న చిన్న కంపెనీలలో పని చేయమని చెప్పారట దాంతో ఇదేమని అడిగిన వారి దగ్గర నుంచీ పాస్పోర్ట్ లాగేసుకున్నారని తెలిపారు భాదితులు..

 

చాలీ చాలని జీతంలో ఒక పూట తినీ తినకుండా పస్తులు ఉన్నామని వారు ఎంతో భాదని వ్యక్తం చేశారు..వారు పడుతున్న కష్టాలని వాట్సప్ ద్వారా పోలీసులకి తెలియడంతో అప్రమత్తమైన పోలీసులు భాదితులని బాదితులని అక్కడి నుంచీ విడిపించుకుని తీసుకువచ్చారు..అయితే ఈ పరిస్థితికి కారణం అయిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు..

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: