మీకు మేమున్నాం..భారతీయుడికి అమెరికన్ల భరోసా

Bhavannarayana Nch

అమెరికాలో రెస్టారెంట్ నడుపుతున్న భారతీయ వ్యక్తికి  జరిగిన అవమానానికి..ఆ వ్యక్తి  పడిన భయాన్ని పోగాట్టాడానికి అమెరికన్లు నడుం కట్టారు..అతడికి మేమున్నామని భరోసా ఇచ్చారు..ఒక అమెరికన్ అతడి భయానికి కారణం అవ్వడంతో అక్కడి మేయర్ తో సహా అందరూ అతడి హోటల్ కి వెళ్లి అతడిని పరామర్శించారు..అంతేకాదు నీకు ఎప్పుడు ఏమి అమసరం అయినా మమ్మల్ని నేరుగా కలవచ్చు అంటూ భరోసా ఇచ్చారు..ఇంతకీ ఆ భారతీయ వ్యక్తి ఎదుర్కున్న సంఘటన ఏమిటి..? ఎలాంటి పరిస్థితులని అతడు ఎదుర్కున్నాడు అనే వివరాలలోకి వెళ్తే..

 

 న్యూయార్క్ రాష్ట్రంలోని ఏష్‌ల్యాండ్ నగరంలో తాజ్ సర్దార్  అనే వ్యక్తి 2010 నుంచీ రెస్టరెంట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు..ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తన రెస్టరెంట్‌లో భోజనం చేయడానికని వచ్చిన ఓ వ్యక్తి తాజ్ సర్దార్‌ను ఆల్‌ఖైదాతో కూడా తనకు సంబంధం ఉన్నట్టు కనపడుతోంది అంటూ  జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. అక్కడితో ఆగకుండా హోటల్ ఫొటోను తీసి తన ఫేస్‌బుక్‌లో పెట్టి తానూ కల్లిన బిల్లు ఆల్‌ఖైదాకు నిధులు సమకూర్చానని పోస్ట్ చేశాడు.

 

ఈ వ్యవహారంతో భాదపడిన సర్దార్ ఈ పరిణామం తనని అక్కడి నుంచీ పంపేయడానికి దారితీసేలా ఉందని భయపడ్డాడు..అందరూ తన హోటల్‌పై దాడి చేస్తారనుకుంటే, అలా కాకుండా అందరూ తనవైపే ఉండటం చూసి సర్దార్ ఆశ్యర్యపోయాడు. విషయం తెలుసుకున్న నగర మేయర్ స్టీవ్ గిల్మోర్‌తో పాటుగా ముగ్గురు సిటీ కమిషనర్‌లు సర్దార్ కి తమ పూర్తి మద్దతు తెలిపారు.. సర్దార్ లాంటి వ్యక్తి తమ మధ్యలో ఉండటం తమకే గర్వకారణమని మేయర్ తెలిపాడు అతడికి భరోసా ఇచ్చారు..అయితే సర్దార్ కి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన అతడు పనిచేస్తున్న సంస్థ అతడిని ఉద్యోగంలో నుంచీ తీసేసింది..సర్దార్ కి క్షమాపణలు కోరింది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: