అమెరికాలో....." తెలుగోడి ప్రతిభ"

NCR

అమెరికా లాంటి అగ్రరాజ్యంలో భారతీయులకి కొదవే లేదు..మన భారతీయుల ప్రతిభా పాటవాలు ప్రత్యేకించి మనం చెప్పుకోవలసిన అవసరం లేదు రోజూ ఎదో ఒక చోట అమెరికాలో భారతీయులు గుర్తింపు పొందుతూనే ఉంటారు.ఈ క్రమంలోనే భారతీయుడు అందులోనూ  ఓ తెలుగు ఆణిముత్యం ఓ బహుమతిని సాధించాడు. అమెరికాలో ఉన్న ఒక సమస్యకి పరిష్కారం చూపించి ఈ బహుమతి గెలుచుకున్నాడు తెలుగు ఎన్నారై విద్యార్ధి..ఇంతకీ ఏమిటా బహుమతి..?? అతడు పరిష్కరించిన సమస్య ఏమిటనే వివరాలలోకి వెళ్తే..

 

పార్కింగ్‌ సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించే దిశగా అమెరికాలోని ఓ తెలుగు విద్యార్థి ఖాళీ జాగాను గుర్తించే క్రమసూత్ర పద్ధతి(అల్గోరిథం)ని రూపొందించాడు. పార్కింగ్‌ ప్రదేశంలోకి ప్రవేశించిన వెంటనే ఖాళీ జాగా ఎక్కడుందో గుర్తించగలగడమే సమస్యకు పరిష్కారమని సాయి ప్రతిపాదించాడు...దాంతో '2018 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఓపెన్‌హౌస్‌' పోటీల్లో రెండో బహుమతిని సాధించాడు..

 

సదరు విద్యార్ధి పేరు మెట్టుపల్లి సాయి నిఖిల్‌రెడ్డి అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. డ్రైవర్లు ఖాళీగా ఉండే పార్కింగ్‌ ప్రదేశంలోకి నేరుగా వెళ్లిపోయేలా 'ఇన్‌స్టాపార్క్‌' అనే మొబైల్‌ యాప్‌ను సాయి అభివృద్ధి చేస్తున్నాడు. ఇందులో ఫోన్‌ జీపీఎస్‌ ద్వారా పార్కింగ్‌ ప్రదేశంలోని ఖాళీ జాగాలు..కార్లతో నిండిపోయిన ప్రదేశాల గ్రిడ్‌ లేఅవుట్‌ ప్రత్యక్షమవుతుంది..అయితే అతడి కృషి కి తానూ చదువుతున్న వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వినీతా మెనన్‌ బిగ్‌డేటా అనలిటిక్స్‌ ల్యాబ్‌ ద్వారా నిఖిల్ రెడ్డి కి సాయం అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: