అమెరికాలో “1445కోట్ల” భారీ లాటరీ..ఎవరికి దక్కిందో తెలుసా..??

NCR

గత నెలలో అమెరికాలో దాదాపు కొన్ని మిలియన్ కోట్ల రూపాయల భారీ లాటరీని ఒక సాధారణ మహిళ గెలుచుకుంది అయితే ఆమె పేరు వెల్లడించడానికి రూల్స్ ఒప్పుకోవు కావున పూర్తి వివరాలు వెల్లడించలేక పోయారు. అప్పట్లో ఆ న్యూస్ ఎంతో మంది లాటరీ ప్రియులకి ఈర్ష్య తెప్పించింది..అయితే తాజాగా మరొక భారీ లాటరీ అమెరికాలో ఓ సాధారణ మహిళకి తగిలింది.

 

దాదాపు ఆ మహిళకి ఏకంగా 1445కోట్ల రూపాయల లాటరీ తగిలింది దాంతో ఆమె షాక్ లో ఉందని తెలుస్తోంది. వివరాలలోకి వెళ్తే...అమెరికాలోని లోవాకు చెందిన లెరిన్నె వెస్ట్ అనే మహిళను దాదాపు 1445 కోట్ల విలువ గల భారీ ‘పవర్ బాల్ లాటరీ’ వరించింది. అక్టోబర్ 27న తీసిన డ్రాలో ఆమె విజేతగా నిలిచింది.

 

 ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నఈ అదృష్టవంతురాలు సరిగ్గా వారం క్రితమే రిటైరయింది. లాటరీలో దక్కిన డబ్బుతో ఓ ఫౌండేషన్ స్థాపించి మంచి ,సేవా కార్యక్రమాలను చేపట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన  కూతుళ్ల జీవితాల ఎదుగుదల కోసం ఈ డబ్బును ఖర్చు చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: