"9 మంది భారతీయులని"...వరించిన...దుబాయ్ బంపర్ లాటరీ..!!!!

NCR

యూఏఈ లోని అబుదాబిలో ప్రతీ నెలా నిర్వహించే లక్కీ లాటరీ డ్రాలో ఓ భారతీయుడు దాదాపు రూ.27.7 కోట్ల గెలుపొందాడు. ఈ లాటరీ ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేశారు అబుదాబి డ్యూటీ ఫ్రీ బిగ్  లాటరీ నిర్వాహకులు.  ఈ భారీ లాటరీలో గెలుపొందిన భారతీయ వ్యక్తి షార్జాలో నివసిస్తున్నారని తెలిపారు లాటరీ నిర్వాహకులు. వివరాలలోకి వెళ్తే..

 

లాటరీ గెలుపొందిన వ్యక్తి పేరు షోజిత్ గతనెల 1వ తేదీన ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ లాటరీ గెలుపొందిన వ్యక్తికి ఈ విషయం తెలియక తమకి అందుబాటులో లేదని తమ ఫోన్ కాల్స్ స్వీకరించడం లేదని లాటరీ నిర్వాహకులు తెలిపారు.  త్వరలో తాము షోజిత్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

 

ఒక వేళ షోజిత్ అందుబాటులోకి రాకపోతే తామే అతని వద్దకి వెళ్తామని నిర్వాహకులైన నిర్వహిస్తున్న రిచార్డ్ తెలిపారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే. ఇదే లాటరీలో మరో 8 మంది భారతీయులు వివిధ బహుమతులు గెలుపొందారు. మంగేశ్ మైందె అనే భారతీయుడికి  బీఎండబ్ల్యూ కారు దక్కగా మరో  ఏడుగురు భారతీయులకి వివిధ బహుమతులు దక్కాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: