అమెరికాలో జూన్ 15న..."TPAD వనభోజనాలు"..!!!
టీపాడ్ (తెలంగాణా పీపుల్
అసోసియేషన్ ఆఫ్ డల్లాస్) ఆధ్వర్యంలో అమెరికాలో వనభోజనాల ఏర్పాటు చేస్తున్నట్టుగా
టీపాడ్ తెలిపింది. ఓ శ్రీర్షికతో కూడిన ప్రతిని విడుదల చేసింది. స్వచ్చమైన గాలిని,
అచ్చమైన పచ్చదనాన్ని తనివితీరా ఆస్వాదించి , ఆత్మీయ అనురాగాలతో, సుఖసంతోషాలతో, భందు మిత్రులతో సంతోషాన్ని
పంచుకుంటూ మవములో సంబరం అంబరాన్ని తాకేలా చేసే భోజనమే వన భోజనం అంటూ ఆత్మీయ ఆహ్వానం
తన సంస్థ సభ్యులకి అందించింది.
టీపాడ్ ఏర్పాటు చేసే ఈ వనభోజనాల ప్రకటన పత్రిక అందరిని ఆకట్టుకుంది. జూన్ 15 శనివారం, ఉదయం 11 గంటల మొదలు సాయంత్రం 6 గంటల వరకూ పైలట్ క్నోల్ పార్క్ లో వనభోజనాలు జరుగుతాయని టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు సరదాగా గడిపేలా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
కబడ్డీ, కోకో, వాలీబాల్, క్రికెట్, కిడ్స్ పెయింటింగ్ , అంతాక్షరి, తొక్కుడు బిళ్ళ, కైట్ ఫ్లైయింగ్ బోట్ రైడింగ్ వంటి అనేక కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని అందరూ ఉశ్చాహంగా పాల్గోనచ్చని తెలిపారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని ప్రకటనలో తెలిపారు.