అమెరికా బీచ్ లో సీసాలో దొరికిన లేఖ..ఎన్ని ఏళ్ళనాటిదో తెలుసా...!!!

NCR

మనం చాలా సినిమాలో బీచ్ లో ఓ వ్యక్తికి  సీసా దొరకడం , ఆ సీసాలో ఓ లెటర్ ఉండటం, దాన్ని ఎంతో ఆత్రుతగా చదివి అందులో ఉండే సీక్రెట్ ని చెందించడం ఇలా రకరకాల కధనాలతో కూడిన సినిమాలు అనేకం ఉన్నాయి. బీచ్ లో సీసా కాన్సెప్ట్ ఒక్కటే కానీ కధలు వేరు. అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఎంతో వింతగా ఉన్న ఈ రియల్ స్టొరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

అమెరికాలోని అలాస్కా కి చెందిన ఒక వ్యక్తి తనకి దగ్గరలో ఉన్న ఓ బీచ్ కి వెళ్ళాడు. సరదాగా అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో తనకి ఓ పాత సీసా కంటపడింది.దాన్ని పరీక్షించి చూసిన అతడికి అందులో ఓ లేఖ కూడా కనిపించింది. దాంతో ఎంతో ఆత్రుతగా సీసా మూత తీసి లేఖని బయటకి తీసి చదవబోయాడు..కానీ

 

ఆ లేఖ రష్యన్ బాషలో ఉంది దాంతో సోషల్ మీడియాలో జరిగింది అంతా చెప్పి ఆ లేఖని పోస్ట్ చేశాడు. చాలా మంది రష్యన్లు ఇంగ్లీషులోకి అనువదించారు. 1969 లో జరిగిన వార్ సమయంలో ఈ లేఖని రాసినట్టుగా వారు తెలిపారు. అనటోలి బోత్సానెంకో అనే ఓ కెప్టెన్ ఈ లేఖని రాశాడట. దాంతో రష్యాకి చెందిన ఓ జర్నలిస్ట్ అతడు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని ఈ లేఖని చూపించారట. దాంతో అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యడట. ఇది రాసింది నేనే అంటూ చెప్పుకొచ్చాడట. ఈ లేఖని చదివిన వాళ్ళు తనకి బదులు ఇవ్వాలని అందులో పేర్కొని ఉంది. అయితే పూర్తి సారంశం ఇంకా ఎవరికీ తెలియరాలేదు.ఇంతకీ ఆ లేఖ సుమారు 50 ఏళ్ళ నాటిది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: