అమెరికాలో నాట్స్ క్రికెట్ పోటీలు విజయవంతం...!!!
అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో నాట్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సేవా కార్యక్రమాలు చేపట్టడం మొదలు, ప్రతీ వయస్కుల వారికి నాట్స్ సేవలని అందిస్తుంది. విద్యార్ధులకి స్కారల్స్ ఇస్తూ విద్యాభి వృద్దికి కూడా నాట్స్ ఎంతగానో సహాయపడుతుంది. తెలుగు వారందరినీ అమెరికాలో ఒకే చోట కలిపడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పండుగలు మొదలు, అన్నీ కార్యక్రమాలు నాట్స్ చేపట్టింది.
ఇదిలాఉంటే నాట్స్ తాజాగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి అమెరికాలో తెలుగు వారిలో దాగున్న టాలెంట్ బయటకి తీసింది. ఈ టోర్నమెంట్ కి విశేష ఆదరణ లభించింది. సుమారు 15జట్లు 22 మ్యాచ్ లతో నిర్వహించిన ఈ పోటీలు ఎంతో విజయవంతంగా ముగిశాయి. ప్రతీ ఒక్కరూ ఎంతో ఉశ్చాహంగా ఈ టోర్నీలో పాల్గొని తమ ప్రతిభని చాటారు..అంతేకాదు నిత్యం బిజీ బిజీగా ఉన్న తమ జీవితాలకి ఈ ఆటవిడుపు ఎంతో హాయిని ఇచ్చిందని తెలిపారు.
ఈ టోర్నీలో రైజింగ్ బుల్స్ టీమ్ చికాగో క్రికెట్ టోర్నమెంట్ కప్ 2019 ని కైవశం చేసుకుంది. చికాగో నాట్స్ సభ్యులు మహేష్ కాకర్ల , మూర్తి కొప్పాక , రాజేష్ , శ్రీనివాస్ , నిమ్మగడ్డ కృష్ణ ,బొప్పన శ్రీనివాస్, బాలినేని, కార్తీక్ , శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి ఎంతో శ్రమించారు. అందరికి హైదరాబాద్ హౌస్ భోజన ఏర్పాట్లు చేసింది.