73 లక్షల ఖరీదైన బీర్... ఎక్కడ?

Gowtham Rohith
ఒక బీర్ ఎంత ఉంటుంది 100 నుండి 250 రుపాయలు  మన దేశం లో కొన్ని చోట్ల బ్యాన్ వల్ల  దాదాపు 500 దాకా ఉంటుంది , కాని ఒక జర్నలిస్ట్ మాత్రం ఒక్క బీర్ కోసం అక్షరాలా 73 లక్షలు చెల్లించారు.  ఇప్పటీ వరకు ఇదే ప్రపంచం లో‌ అతి ఖరీదైన బీర్ అని వ్యంగ్యం‌గా తన ట్విట్ట ఖాతాలో పోస్ట్ చేశాడు.


ఆస్ట్రేలియా వార్తాపత్రిక  చీఫ్ క్రికెట్ జర్నలిస్ట్,  బీర్ ఎడిటర్ పీటర్ లాలోర్  దగ్గర  మాంచెస్టర్‌లోని మాల్మైసన్ హోటల్‌ వారు భారీ మొత్తాన్ని వసూలు చేశారు.   పీటర్ తన విషాద కథ గురించి, తను డ్యూచర్స్ ఐపిఎ బీర్ ను తాగడానికి చెల్లించిన భారీ మొత్తం గురించి  ట్విట్టర్‌లోకి ఒక ట్వీట్ చేశాడు. అతను తన ట్విట్టర్‌లో బీర్ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ "ఈ బీర్ చూడండి? ఇది చరిత్రలో అత్యంత ఖరీదైన బీర్. నిన్న రాత్రి మాంచెస్టర్‌లోని మాల్మైసన్ హోటల్‌లో నేను దాని కోసం, 9 99,983.64 డాలర్లు చెల్లించాను." అని పోస్ట్ చేశాడు.



See this beer? That is the most expensive beer in history.
I paid $99,983.64 for it in the Malmaison Hotel, Manchester the other night.
Seriously.

Contd. pic.twitter.com/Q54SoBB7wu

— Peter Lalor (@plalor) September 5, 2019

బిల్లు చెల్లించే సమయం‌లో‌  అతను అద్దాలు ధరించనందుకు  ఇంత భారీ‌ మూల్యం చెల్లించానని తను తన ట్విట్తర్ ఖాతాలో తెలిపాడు. తన ఖాతా నుండి అధిక మొత్తాన్ని స్వైప్ చేసినట్టు తెలుసుకున్న పీటర్ , హోటల్ సిబ్బంది తో మాట్లాడగా వారూ ఆ మొత్తాన్ని తనకు బ్యాంక్ నుండి తిరిగి వచ్చేలా చేస్తామని చెప్పారు. కానీ కొద్ది సేపటి  తరువాత, అతని భార్య ఫోన్ చేసి ట్రాన్సాక్షన్ ఫీజు 2,499.59 డాలర్లు ( 1,79,288 రూపాయలు) కూడా దాని పైన వేశారని తెలిపింది.



Then came the call from home. The sum of $99,983.64 had been removed from our account.
And, there’d been a transaction fee of $2,499.59 to add to the pain.
The fee has been refunded but not the larger amount.

— Peter Lalor (@plalor) September 5, 2019

ఆ హోటల్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "మేము ప్రస్తుతం ఏమి జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నాము. లాలోర్ కి క్షమాపణలు చెప్పుకుంటున్నాము, సాధ్యమైనంత త్వరగా దీనిని పరిష్కరించడానికి మేము పీటర్‌తో సంప్రదిస్తున్నాము." అని తెలిపారు. ఈ ఉదాహరణ  ఖచ్చితంగా రాహుల్ బోస్ గురించి  గుర్తు చేసింది. అతను కేవలం రెండు అరటిపండ్లకు మరియు చండీఘర్ లోని మారియట్ హోటల్‌కు 442 రూపాయలు చెల్లించిన విషయం అంతర్జాలం లో వైరల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: