దేశం కాని దేశంలో హైదరాబాదీలు మృతి...!!!!

NCR

ఎన్నో ఏళ్ళ క్రితమే హైదరాబాద్ నుంచీ దుబాయ్ వెళ్లి అక్కడ స్థిరపడిన ఓ కుటుంభం మృత్యువాత పడింది. ఒమెన్ లో ఆర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన ముగ్గురు మృతి చెందారు. అయితే ఈ ముగ్గురు ఒకే కుటుంభానికి చెందిన వారు కావడంతో మరింత విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కి చెందిన గౌసుల్లా ఖాన్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఒమెన్ లోనే ఉంటున్నారు.

 

దుబాయ్ నుంచీ ఒమెన్ వెళ్తున్న క్రమంలోనే ఎదురుగా ఎంతో వేగంగా వచ్చిన కారు వారి కారుని డీ కొట్టింది. దాంతో గౌసుల్లా ఖాన్, కుమార్తె , భార్య  ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మరొక కుమార్తె తీవ్రంగా గాయపడింది . తక్షణమే స్పందించిన స్థానికులు పాపని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఎదురుగా వచ్చి డీ కొట్టిన కారులో ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒమెన్ ప్రభుత్వ అధికారి కాగా మరొకరు ఏపీ లోని ప్రకాశం జిల్లాకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిగా గుర్తించారు.

 

ఇదిలాఉంటే శ్రీనివాస్ అనే వ్యక్తి గడిచిన 8 రోజులుగా కన్పించడం లేదని ఒమెన్ లో ఉన్న తెలుగు సంఘాలు వెతుకుతూనే ఉన్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అందరూ ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాస్ ని గుర్తించారు. కొన్ని రోజులుగా అతడు కనపడటం లేదని ఇలా జరుగుతుందని ఊహించలేదని వాపోయారు. ఈ నెల 5 న హైదరాబాద్ నుంచీ రియాద్ వచ్చాడని, ఆ తరువాత నుంచీ కనిపించకుండా పోయాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: