అమెరికా ప్రైమరీ ఎన్నికల్లో సత్తాచాటిన...“కృష్ణమూర్తి”

frame అమెరికా ప్రైమరీ ఎన్నికల్లో సత్తాచాటిన...“కృష్ణమూర్తి”

NCR

అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రజలు ఎంతో మంది వివిధ రంగాలలో మనదైన శైలిలో తమ ప్రతిభాపాటవాలు చూపిస్తున్నారు. విద్యా, వైద్యం, టెక్నాలజీ రంగాలలోనే కాకుండా అత్యంత ముఖ్యమైన రాజకీయరంగంలో సైతం దూసుకుపోతున్నారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకంటే ముందుగా జరగబోయే ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వారు అమెరికాలో సత్తా చాటుతున్నారు.

IHG

డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన భారత సంతతి చట్ట సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో సత్తా చాటారు. ఇల్లినాయిస్ లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయులలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణమూర్తి డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి సుమారు 80 శాతం ఓట్లు సాధించి గెలుపు సొంతం చేసుకున్నారు. తన ప్రత్యర్ధి అయిన విలియం ఒల్సన్ కేవలం 13 శాతం ఓట్లు సాధించడం స్థానికంగా ఆశ్చర్యాని కలిగించిందని అమెరికా మీడియా పేర్కొంది.

IHG

కరోనా కారణంగా మార్చి 17 న జరగాల్సిన రిపబ్లికన్ ప్రైమరీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మరో సారి తాను కాంగ్రెస్ కి ఎన్నిక కాబడితే ప్రజలకోసం వారి ప్రాధాన్యతల కోసం తన పోరాటాని కొనసాగిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం కరోనా అమెరికా వ్యాప్తంగా ప్రభలుతున్న కారణంగా తనవంతు సాయం అందిస్తానని ప్రకటించారు.కృష్ణ మూర్తి భారత్ అమెరికాల మధ్య సంభంధాలు మెరుగుపడేలా చేయడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: