కరోనా ఎఫెక్ట్ : అమెరికాలో "1.5 కోట్ల"ఉద్యోగాలు హాంఫట్...!!!!

NCR

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పులి పంజా విసురుతోంది. ఇప్పటికే వేలాదిమంది ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు పోగొట్టుకుంటే లక్షలాది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అగ్ర రాజ్యం అమెరికాలో పరిస్థితి చైనా కంటే కూడా ముదిరిపోతున్న ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. కేవలం ఒక్క రోజులేనే సుమారు 400ల మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది..ముఖ్యంగా కరోనా పాజిటివ్ కేసులు ఏ దేశంలో లేనంతగా లక్ష పై చీలుకు నమోదవ్వడం అమెరికాని అక్కడి ప్రజలని కలవరపెడుతోంది...ఇదిలాఉంటే

తాజాగా సర్వేల ప్రకారం అమెరికా వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని అంటున్నారు నిపుణులు. ఎకనిమిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంచనాల ప్రకారం కరోనా భారంతో అమెరికాలో పలు కంపెనీలు ఆర్ధికంగా నష్టపోయే అవకాశాలు భారీగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగులని ఆయా కంపెనీలు తీసేసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ సంఖ్య అమెరికాలోని అన్ని ప్రైవేట్ రిటైల్ ఉద్యోగాలకంటే కూడా పది శాతానికి మించి ఉంటుందని తెలిపింది...అయితే

భారత్ తో పాటు మిగిలిన దేశాలలో కూడా ఈ పరిస్థితి ఎంతో దారుణంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించింది. భారత్ లో లాక్ డౌన్ వలన సుమారు 9 లక్షల కోట్లు భారీ నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తాజా సర్వే లెక్కలు చూస్తుంటే అమెరికాలో భారీగా ఉద్యోగాలు ఊడిపోతే ఈ ప్రభావం భారత టెకీలు, ఇతర ఉద్యోగాలు చేసుకునే వారిపై తీవ్రమైన ప్రభావమే చూపుతుందని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: