ఎన్నారైల అభ్యర్ధన..పచ్చ జెండా ఊపిన కేంద్రం..!!!
భారత దేశం నుంచీ వివిధ దేశాలకి వెళ్ళి స్థిరపడిన ఎన్నారైలు లక్షల సంఖ్యలోనే ఉన్నారు. అమెరికా వంటి దేశంలో భారత ఎన్నారైలు అత్యధికంగా ఉన్నారు. శాశ్వతంగా ఆయా దేశాలలో నివాసం పొందిన వారు కాకుండా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు ఎవరైనా చనిపోతే వారి అంతిమ సంస్కరణలు సొంత ఊళ్లలో చేస్తుంటారు. గతంలో ఎవరైనా చనిపోతే వారి సొంత ఖర్చులతో నియమ నిభంధనలకి అనుగుణంగా ఇండియాకి తీసుకువచ్చి దహన కార్యక్రమాలు చేపట్టేవారు..కానీ ప్రస్తుతం కరోనా విస్తరించిన సమయంలో ఎవరైనా వేరే కారణాల ద్వారా చనిపోయినా కొన్ని నియమ నిభందనలు పెట్టడంతో..ఎంతోమంది ఎన్నారైలు భారత ప్రభుత్వానికి అభ్యర్ధన పెట్టుకున్నారు..ఆ వివరాలోకి వెళ్తే..
విదేశాలలో చనిపోయిన ఎన్నారైల మృత దేహాలని భారత్ కి తరలించే విషయంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే అందుకుగాను అనుమతులు ఇస్తూనే కొన్ని షరతులు కూడా పెట్టింది. ఈ షరతుల ప్రకారం భారతీయ ఎన్నారైల మృత దేహాలు అనుమతించాలంటే తప్పకుండా భారత ఎంబసీ చనిపోయిన వ్యక్తికి అనుమతుల పత్రం తీసుకోవాలని తెలిపింది. అంతేకాదు కరోనా కారణంగా చనిపోయిన వారి మృత దేహాలని తరలించ కూడదనే నిభందన పెట్టింది. ఇదిలాఉంటే కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి..ఈ కారణంగా
విమానయాన సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి..కానీ గతంలో అంటే కరోనాకి ముందు మృత దేహాలని ప్యాసింజర్ విమానాలలో తరలించేవారు కానీ ఇప్పుడు కరోనా తీవ్రస్థాయిలో విస్తరిస్తున్న కారణంగా మృత దేహాలని కార్గో విమానాలలో తరలిస్తున్నారు. అయితే కరోనా కారణంగా మృత దేహాలని స్వస్థలాలకి పంపడంపై నిషేధం విధించడంతో ఆందోళన చెందిన ఎన్నారైలకి మాత్రం కేంద్రం ఇచ్చిన తాజాగా ఆదేశాలు ఊరటని ఇచ్చాయనే చెప్పాలి..