ఈ ఎన్నారైల పరిస్థితి దయనీయం..!

Suma Kallamadi

విదేశాలలో కంటే మన దేశం లో చిక్కుకుపోయిన ఎన్నారైల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది ఎన్నారైలు తమ వ్యక్తిగత విషయాల కొరకై విదేశాల నుండి స్వదేశమైన భారతదేశానికి విచ్చేశారు. అయితే అనుకోకుండా భారత దేశంలో రెండు నెలలపాటు లాక్ డౌన్ విధించడంతో ఎన్ఆర్ఐ లో తమ పనులను చేసుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఉద్యోగం వచ్చి ఇండియాకి తిరిగి వచ్చిన ఎన్నారైలు తమ ఉద్యోగాలు పోతాయి అనే భయంతో నిద్ర కూడా పోవడం లేదు. ఇలా ఇండియాకి తిరిగి వచ్చిన ఎన్నారైలు వందల సంఖ్యలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశంలో మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుండగా... విమాన రాకపోకలు అప్పటివరకు నిలిచిపోయాయి. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసిన విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పడం అసాధ్యం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన తేజస్విని ఒక న్యూస్ చానల్ తో మాట్లాడుతూ... మే 17వరకు కఠినతరమైన లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఆ తర్వాత కూడా విమానాలు ఇతర దేశాలకు ప్రజారవాణా చేస్తాయని నేను అనుకోవడం లేదు. నేను అమెరికాలోని ఒక డాక్టర్ తో అపాయింట్మెంట్ తీసుకున్నాను. అది గనుక మిస్ అయితే మళ్ళీ అతని అపాయింట్మెంట్ దొరకడానికి ఎన్ని నెలల సమయం పడుతుంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తేజస్విని భర్త అమెరికాలోని మిచిగాన్ లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాకి తిరిగి వచ్చిన ఏమే మార్చి 28 వ తేదీన అమెరికా కి వెళ్ళాలి అనుకుంది కానీ లాక్ డౌన్ వలన ఇక్కడే చిక్కుకుపోయింది.


బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ తన పిల్లల అత్యవసర అవసరాల మేరకు ఇండియాకు తిరిగి రాక తన భార్య మాత్రం అమెరికాలోని బోస్టన్ లోనే ఉండిపోయింది. భార్య ఒంటరిగా ఎలా జీవిస్తుందోనని శ్రీకాంత్ కంగారు పడుతున్నాడు. అలాగే బోస్టన్లో తనకు ఉన్న జాబ్ కూడా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. త్వరగా బోస్టన్ కి చేరుకోకపోతే నా ఉద్యోగం ఓడిపోతుంది అని ఆయన చెప్తూ తన బాధను వెళ్లబోసుకున్నాడు. తన అమ్మ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రష్మీ దేశ్పాండే మానసిక వ్యాధులతో బాధపడుతున్న తన ఎనిమిదేళ్ల కుమారుడిని ఒంటరిగా అమెరికాలో వదిలేసి వచ్చింది. ప్రస్తుతం ఆ తల్లి బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే విదేశాల్లో వందల సంఖ్యలో గర్భవతులు ఒంటరిగా మిగిలిపోయారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చిక్కుకుపోయిన చాలామంది అన్న ఎన్ఆర్ఐలు తమ కోసం స్పెషల్ ఫైట్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: