చైనా అంటే ఛీఛీ అంటున్న తల్లి తండ్రులు

Gullapally Rajesh
భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు ఇప్పట్లో చల్లారే అవకాశాలు అయితే ఏ మాత్రం కూడా కనపడటం లేదు. భారత్ విషయంలో చైనా వ్యవహారశైలి పై చాలానే విమర్శలు వస్తున్నాయి. చైనా కుక్క బుద్ధి చూపిస్తుంది అంటూ దాని చుట్టూ  ఉన్న అన్ని సరిహద్దు దేశాలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి. పాకిస్తాన్ కి కూడా చైనా నుంచి పరోక్ష సహాయ సహకారాలు అందుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెడితే...  మన దేశం నుంచి చైనా ఎవరూ వెళ్ళే అవకాశం లేదు అని నిపుణులు అంటున్నారు.


చైనా అనగానే చాలా మంది తల్లి తండ్రులు ఛీ ఛీ అంటున్నారు అని టాక్. చైనాలో మెడిసిన్ విద్య కోసం సహా ఐటి కంపెనీల్లో పని చేయడానికి గానూ కొందరు వెళ్తూ ఉంటారు. కాని ఇప్పుడు అక్కడికి అసలు ఏ మాత్రం వెళ్ళవద్దు అని చెప్తున్నారట తల్లి తండ్రులు. అవసరం అయితే చైనా కాకుండా రష్యా లేదా బ్రిటన్ వెళ్ళాలి అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. బ్రిటన్,జర్మనీ,ఇటలీ తో   సహా ఏ యూరప్ దేశం అయినా వెళ్ళాలి గాని చైనా మాత్రం వద్దు అని చెప్తున్నారట. చైనాలో ఉంటే ఎప్పుడు  ఏ రోగాలు వస్తాయో తెలియదు అని, అక్కడికి వద్దు అని చెప్తున్నారట తల్లి తండ్రులు.


చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లాలను చైనా నుంచి వచ్చేయాలి అని కూడా కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి. చైనాలో మెడిసిన్ కి మంచి గుర్తింపు ఉంది. అంతే కాకుండా అక్కడి ఫార్మా కంపెనీల్లో మన వాళ్ళు చాలా మంది పని చేస్తూ ఉంటారు. కాని అసలు ఏ మాత్రం కూడా చైనా వద్దు అని తల్లి తండ్రులు స్పష్టంగా చెప్పెస్తున్నారట మరి. కాగా చైనా మరోసారి సరిహద్దుల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: