ట్రంప్ పై బిడెన్ “కమలాస్త్రం” ఎంపిక అందుకే జరిగిందా..!!
కమలా హారీస్ ఎంపిక ఎందుకంటే
అమెరికా ఉక్కు మహిళగా పేరొందిన కమలా హారీస్ మాట్లాడటంలో దిట్ట. ప్రత్యర్ధిని మాటలతోనే మట్టి కరిపించడంలో ఆమెకి సాటి మరెవరూ లేరనే చెప్పాలి. బిడెన్ తో పాటు అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేసిన కమలానే ఉపాధ్యక్ష అభ్యర్ధిగా బిడెన్ ఎంపిక చేయడంతో ఆమె ప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కమలా హారీస్ ని బిడెన్ ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడానికి కారణం లేకపోలేదు. నల్లజాతీయురాలుగా, భారతీయ హిందూ మహిళగా ఉన్న కమలా హారీస్ కి ప్రవాస భారతీయులు , అలాగే నల్లజాతీయుల ఓట్లు గంపగుత్తంగా పడతాయని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే. ట్రంప్ విదేశీయుల వీసాలు, ఉద్యోగాలు, విద్యార్ధుల విషయంలో అమెరికన్స్ కి లాభాలు చేకూరేలా వ్యవహరించడంతో ఎక్కువ శాతం నష్టపోతున్నది భారతీయులే అలాగే జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో అమెరికాలో ఎన్నడూ లేనంతగా నిరసనలు వెల్లువెత్తాయి. నల్లజాతీయులు అందరూ ట్రంప్ కి వ్యతిరేకంగా మారిపోయారు. ఇదే సమయంలో ఓబమా సైతం కమల హరీస్ ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన చేయడం, అలాగే భారతీయ సంఘాలు సైతం కమలా హరీస్ ఎంపికపై హర్షం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల ఓట్లు బిడెన్ కొల్లగొట్లినట్లే అంటున్నారు పరిశీలకులు..