ఇండియన్స్ ని బుట్టలో వేయడానికి వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వనున్న ట్రంప్...?
అయితే అమెరికా గనుక ట్రంప్ చెప్పిన విధంగా ముందు వ్యాక్సిన్ ని తాయారు చేసి బహిరంగ మార్కెట్ లోకి విడుదల చేస్తే మాత్రం భారత్ కి దాదాపుగా పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వడానికి ట్రంప్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఆయన ఇప్పటికే ప్రధాని నరేందర్ మోడీ తో కూడా మాట్లాడారు అని అంటున్నారు. భారత్ కి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా అమెరికన్లను, ఎన్నారైలను కూడా ఆకట్టుకోవచ్చు అనే భావనలో ట్రంప్ ఉన్నారు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
చైనా వ్యాక్సిన్ కంటే ముందే అమెరికా తాయారు చేసి భారత్ కు అందించింది అనే విషయాన్ని ఆయన ప్రచారంలో హైలెట్ చేసే అవకాశం ఉంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియన్ ఓట్స్ చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కాస్త ఎక్కువగా ట్రంప్ కూడా ఫోకస్ పెట్టారు. వ్యాక్సిన్ విషయంలో అక్కడి వైద్యుల నుంచి ట్రంప్ కి మాత్రం సహాయ సహకారాలు ఆశించిన స్థాయిలో అందడం లేదు అనే భావన కూడా వ్యక్తమవుతుంది. మరి వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ అనుకున్నది సాధించి ఇండియా కు వ్యాక్సిన్ ఇస్తారా లేదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.