మన ఎన్నారైలకు ఆఫ్రికా దేశాలు గాలం...!

Gullapally Rajesh
మన దేశంలో  చాలా మంది అమెరికా సహా బ్రిటన్ మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. అమెరికాలో ఉండటం పరువుగా కూడా భావించే అవకాశాలు అనేవి ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉండటం కోసం ఆస్తులు కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. యూరప్ దేశాల్లో మంచి ఆఫర్లు వచ్చినా సరే పెద్దగా అటు వెళ్ళే ప్రయత్నం చేయరు.  ఇక ఆఫ్రికా దేశాలు ఆఫర్లు ఇచ్చినా సరే పెద్దగా అటు వైపు వెళ్ళే ప్రయత్నం చేయరు. అయితే ఇప్పుడు ఆఫ్రికా దేశాలు మన వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఆఫ్రికా లో ఇప్పుడు ఐటి కంపెనీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ చిన్న చిన్న కంపెనీలను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మన దేశానికి చెందిన ఐటి నిపుణులను అక్కడి ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్నాయి. ప్రధానంగా సౌత్ ఆఫ్రికా మన వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. ఆఫ్రికా దేశాల్లో సౌత్ ఆఫ్రికా ఒక్కటే కాస్త మెరుగ్గా ఉంది. ఆ తర్వాత కెన్యా ఒకటి. ఆ దేశంలో కూడా ఐటి రంగం పర్వాలేదు. దీనితో మన వాళ్ళ కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రిటన్ సహా అమెరికాలో ఉన్న ఐటి నిపుణులకు గాలం వేస్తున్నారు.

సౌత్ ఆఫ్రికాలో ఐటి ఇప్పుడు ఇప్పుడే బలపడుతుంది. ఈ తరుణంలో వచ్చిన కరోనా తీవ్రంగా ఇబ్బంది పెట్టేసింది. ప్రయతుతం అమెరికా నుంచి చాలా మంది బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారు అందరూ కూడా మా దేశం రావాలి అంటూ ఇప్పటికే చైనా కూడా ఆఫర్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఆఫ్రికా దేశాలు భారీగా ఆఫర్లు ఇవ్వడంతో మన వాళ్ళు అటు చూస్తున్నారు. వాస్తవానికి మెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఖర్చులు చాలా తక్కువ. మరి వెళ్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: