ఇండియా కుర్రాళ్ళ కోసం ట్రంప్...
ఈ నేపధ్యంలో ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారి కోసం ట్రంప్ సర్కార్ కొత్త కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి కోసం ట్రంప్ త్వరలోనే ఒక పాలసీని ప్రకటిస్తారని దీని కోసం కుమార్తె ఇవాంకా ట్రంప్ కి ఆయన కీలక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. దేశ వ్యాప్తంగా కూడా యువ ఇండో అమెరికన్ ఓటర్ల కోసం... వారి ఉద్యోగాల భరోసా కోసం ట్రంప్ కీలక నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఉద్యోగాల విషయంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆందోళనగా ఉన్నారు.
అందుకే ఇండియా నుంచి వచ్చిన వారికి ట్రంప్ అండగా ఉండాలని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అమెరికాలో స్థిరపడిన ఇండో అమెరికన్ సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ట్రంప్ కొన్ని కార్యక్రమాలు ప్రకటిస్తారని అంటున్నారు. అటు జో బిడెన్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇండో అమెరికన్ ఓటర్ల కోసం ఆయన భరోసా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ఇక భారత్ చైనా వివాదాన్ని కూడా ట్రంప్ వాడుకునే ఆలోచనలో ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.