విదేశాల్లో తెలుగు ఎన్నారైలు ఇబ్బంది పడుతున్నారా...? అయితే...!
ఇక అమెరికా సహా యూరప్ దేశాల్లో అయితే పరిస్థితి చాలా వరస్ట్ గా ఉంది అనే చెప్పాలి. మన దేశం నుంచి ఎక్కువగా తెలుగు వారే విదేశాలకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మన తెలుగు వారిని ఆదుకోవడానికి ఇక్కడి ప్రభుత్వాలు కూడా చాలా వరకు కష్టపడుతున్నాయి. అయినా సరే సాధ్యం కావడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కోరాలి అని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ఎన్నార్టీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుమలలో వెంకట్ మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు ఇబ్బందులు పడ్డారు అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొని విదేశాల్లో నివసిస్తూన్న వారికీ సహాయ సహకారాలను అందించింది అని కొనియాడారు. గత మూడున్నర నెలలు కాలంలో వివిధ దేశాల్లో వున్న 40 వేల మంది పైగా ప్రజలను ప్రభుత్వం తిరిగి రాష్ట్రానికి రప్పించింది అని ఆయన చెప్పుకొచ్చారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికీ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఏపీ ఎనార్టి హెల్ప్ లైన్ నెంబర్ కు తెలియ్యజేస్తే వారి సమస్యను పరిష్కరిస్తాం అని ఏపీ ఎనార్టి చైర్మన్ వెంకట్ ఈ సందర్భంగా ప్రకటన చేసారు.