ఎన్నారై డాక్టర్లు వస్తారా...?

Gullapally Venkatesh
దేశ వ్యాప్తంగా ఇప్పుడు వైద్య సేవల విషయంలో ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. వైద్య సేవల విషయంలో ఇప్పుడు చాలా వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. వైద్య సేవలు  భారీగా పెంచే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు చాలా వరకు భారీగా నిధులను కూడా కేటాయిస్తున్నారు.  కరోనా దెబ్బకు  మన దేశంలో కీలక రాష్ట్రాలు అన్నీ కూడా వైద్య సేవల విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడటమే కాదు వైద్యులు కూడా ఇప్పుడు ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.

దీనితో మన దేశంలో కేంద్ర ప్రభుత్వం, అదే విధంగా రాష్ట్రాలు విదేశాల్లో ఉన్న వైద్యులకు గాలం వేస్తున్నాయి. విదేశాల్లో ఉన్న ఎన్నారై వైద్యులకు ఇప్పుడు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చిన్న చిన్న దేశాల్లో మన  వాళ్ళు టాప్ డాక్టర్లు గా ఉన్నారు. అంతే కాకుండా అమెరికా సహా కొన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. ఇటలీ సహా యూరప్ దేశాల్లో మన వాళ్ళు సెటిల్ అయ్యారు. వారిని ఇప్పుడు కేంద్రం పిలుస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఇప్పుడు వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత చాలా వరకు కూడా విదేశీ వైద్యులు వచ్చే అవకాశం ఉంది.

అమెరికాలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ వైద్యులు చాలా మందే ఉన్నారు. వారికి పెద్ద పెద్ద ఆఫర్లు ఇవ్వడానికి ప్రైవేట్ ఆస్పత్రులు రెడీ అయ్యాయి. ఇక కేంద్రం కూడా కొన్ని రూల్స్ మార్చి వారి అనుభవం ఆధారంగా ప్రభుత్వ రంగంలోకి వైద్యులను తీసుకునే ఆలోచన చేస్తుంది. అయితే విదేశాల్లో స్థిరపడిన వారు ఇక్కడికి వస్తారా లేదా అనేది చూడాలి. ఇక చైనా, రష్యా వంటి దేశాల్లో కూడా మన వాళ్ళు ఇప్పుడు ఇండియా రావడానికి  చూపిస్తున్నారు. మరి ఎంత వరకు ఇది ఫలిస్తుంది ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: