బిడెన్ విషయంలో మన భయం ఇదే...!

Gullapally Venkatesh
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు జో బిడెన్ విజయం సాధించారు. జనవరి 20 న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.ఆయన విజయం సాధించడంతో అందరూ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆయన విధానాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటీ అనే దాని మీద ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ విషయంలో ఆయన ఎలా ఆలోచిస్తారు, ఏ  విధంగా ముందుకు వెళ్తారు అనే దాని మీద సర్వత్రా కూడా ఆసక్తి ఉంది అనే చెప్పాలి. అయితే భారతీయుల్లో మాత్రం ఆయన విషయంలో భయం ఉంది.

ప్రధాని మోడీ... ట్రంప్ కి అనుకూలంగా ప్రచారం చేయడం, ప్రచారంలో భారతీయ ఓటర్లను ట్రంప్ వైపు తిప్పే విధంగా వ్యవహరించడం వంటివి జరిగాయి. అంటే తన ఓటమికి మోడీ కృషి చేసారు అనే భావన బిడెన్ లో ఉంది. అయితే ఇప్పుడు బిడెన్ భారత్ విషయంలో విధానాలు మార్చే అవకాశాలు ఉన్నాయి. హెచ్ 1 బీ విషయంలో నిబంధనలు కఠినం అయ్యే అవకాశాలే ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాజకీయంగా ఉన్న కక్ష సాధింపు కచ్చితంగా ఆయన చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇక వాణిజ్యం విషయంలో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. దీనితో అసలు ఏం జరుగుతుంది ఏంటీ అనేది కీలకంగా ఉంది. ఇక బిడెన్... చైనాకు సన్నిహితంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉండవచ్చు. చైనా... కరోనా కట్టడిలో ముందు ఉంది కాబట్టి ఆ దేశం సహకారం తీసుకుని అమెరికాలో కచ్చితంగా కరోనాను కట్టడి చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. త్వరలోనే ఆయన ఒక టాస్క్ ఫోర్స్ ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏమవుతుంది ఏంటీ అనేది చూడాలి. మోడీ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: