రాజకీయంగా ఆలోచిస్తున్న ఎన్నారైలు...!

Gullapally Venkatesh
మన దేశంలో చాలా మంది ఎన్నారైలు వ్యాపారాలు చేసే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం చాలా వరకు కూడా జరుగుతుంది. రాజకీయంగా ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని చాలా మంది మన దేశంలో వ్యాపారాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు రాజకీయంగా ఏ ఇబ్బంది లేని రాష్ట్రాల మీదనే ఎక్కువగా ఎన్నారైలు ఫోకస్ చేస్తున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఎందుకు ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే... రాజకీయంగా ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిలబడే అవకాశం ఉందా లేదా అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి.

ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందిన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఇప్పుడు చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. కాని తెలంగాణా, ఢిల్లీ, రాజస్థాన్ మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదే విధంగా సముద్ర తీర రాష్ట్రమైన ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. తెలంగాణా మీద మన తెలుగు ఎన్నారైలు ఎక్కువగా ఫోకస్ చేసారని వ్యాపార పరిశీలకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.

ముంబైలో  ప్రభుత్వం మీద నమ్మకం లేదని ఎప్పుడు అయినా సరే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉండవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది అని, అలాగే తమిళనాడులో కూడా ఎన్నికల తర్వాత  పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేరు అని భావిస్తున్నారట. ఇక కేరళలో కూడా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటీ అనేది చూడాలి. ఇక ఎన్నారైలకు తెలంగాణా, ఢిల్లీ, కేరళ మీదనే ఎక్కువగా నమ్మకం ఉందని, కర్ణాటక మీద ఉన్నా సరే అక్కడి ప్రభుత్వ మనుగడపై నమ్మకం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: