అమెరికాలో మన వాళ్ళ భవిష్యత్తు ఏంటీ...?

Gullapally Venkatesh
జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు అవుతున్నారు. ట్రంప్ ఎంత బుకాయించినా సరే చివరికి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు బిడెన్ విదేశాల విషయంలో ఎలా వ్యవహరిస్తారు ఏంటీ అనే దాని మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా ఆసియా దేశాల విషయంలో ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియా దేశాలకు అమెరికాతో అవసరం ఎక్కువగా ఉంటది అనే విషయం అందరికి తెలిసిందే. దీనితో ఇప్పుడు అన్ని దేశాల అధినేతలు కూడా బిడెన్ వైఖరిని ఆసక్తికరంగా గమనిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల విషయంలో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానిపై విద్యార్ధులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్కడి యువకులకు భరోసా ఇచ్చారు. విద్య విషయంలో అయినా ఉద్యోగాల విషయంలో అయినా సరే అమెరికా ఫస్ట్ అనే విషయం ఆయన చెప్పారు. దీనితో అసలు తమ భవిష్యత్తు ఏంటీ అనే దానిపై ఇతర దేశాల విద్యార్ధుల్లో ఆందోళన ఉంది. ఇక మన దేశ విద్యార్ధులు చాలా మంది ఉద్యోగాలు రావు అనే నమ్మకంతో అమెరికా నుంచి వచ్చేశారు.

ఇప్పుడు వారికి బిడెన్ భరోసా ఇచ్చే అవకాశం ఉండవచ్చు. ఉద్యోగాల విషయంలో ట్రంప్ అనుసరించిన వైఖరిని ఆయన అనుసరించే అవకాశాలు లేకపోవచ్చు. భారత్ తో ఆయన సన్నిహితంగా ఉండకపోయినా సరే... మన విద్యార్ధుల్లో ప్రతిభ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవచ్చు. ఒబామా సమయంలో ఏ విధంగా అయితే షరతులు ఉన్నాయో తిరిగి అవే తెచ్చే అవకాశం ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. హెచ్ 1 బీ విసాల విషయంలో ఆయన కొన్ని నిబంధనలు మార్చే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: