ట్రంప్ కు వెన్నుపోటు..ఇలా జరుగుతుందని ఊహించలేదేమో..!!

VIKRAM
అహంకారం తలకెక్కితే ఎదో ఒకరోజున పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారుతాయి. అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళే మెడబట్టి బయటకి గెంటేస్తారు కూడా. ఈ పరిస్థితినే తాజాగా ట్రంప్ ఎదుర్కుంటున్నారు. అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తనకు తిరుగులేని మెజారిటీ వస్తుందని భావించిన ట్రంప్, ఓటమి చవిచూసే సరికి కల్లు తాగిన కోతిలా గెంతడం మొదలు పెట్టారు. నేనే గెలిచా అంటూ, నా ఓటమిలో కుట్ర జరిగిందని కోర్టు మెట్లు ఎక్కిగా న్యాయస్థానం  ఈడ్చి తన్నింది. తాను అధ్యక్షుడు అయ్యే అన్ని అవకాశాలను ట్రంప్ ఉపయోగించినా అవి నిరుపయోగమయ్యాయి. దాంతో..
ఇక చివరిగా ట్రంప్ అమెరికా క్యాపిటల్ వద్ద భారీ నిరసనకు ట్రంప్ పిలుపునిచ్చారు. అక్కడ ట్రంప్ మద్దతు దారులు సృష్టించిన బీభత్సం అందరూ కళ్ళారా చూసిందే. ట్రంప్ అహంకార అధికార దాహానికి నలుగురు అమెరికన్స్ మృతి చెందారు. ఎలాంటి గొడవలు జరిగిన అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే. ట్రంప్ కి నమ్మిన బంటుగా గడిచిన నాలుగేళ్ళుగా వెన్నంటే ఉన్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చారు..
ఒక పక్క ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తుంటే మైక్ పైన్స్ మాత్రం ట్రంప్ ఒడి, బిడెన్ గెలిచినట్టుగా జరిగిన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. అమెరికా, కాంగ్రెస్ , సెనేట్ రెండూ సంయుక్తంగా బిడెన్ ను అధ్యక్షుడిగా ద్రువీకరించాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా మైక్ పైన్స్ ఉంటారు. అయితే ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించిన ట్రంప్ ఈ ఎన్నికలను తోసిపుచ్చాలని మైక్ పైన్స్ కు సూచనలు చేశారు. కానీ మైక్ పైన్స్ మాత్రం రాజ్యంగబద్దంగా వ్యవహరించారు. విలువలకు కట్టుబడిన మైక్ ఎలక్టోరల్ ఓట్ల విషయంలో తానూ ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేనని ఆ అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. బిడెన్ ను అధ్యక్షుడిగా ప్రకటించారు. ట్రంప్ మద్దతు దారులు మైక్ పైన్స్ ట్రంప్ కు వెన్నుపోటు పొడిచారని ఆరోపణలు చేస్తుంటే..ఇది సరైన నిర్ణయమంటూ అమెరికన్స్ మైక్ పైన్స్ ని అభినందిచారు. ఎప్పడూ పెద్దగా వార్తల్లో నిలువని మైక్ తాజా సంఘటనతో హీరో అనిపించుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: