భారత్ కు భారీగా పెట్టుబడులు
ప్రధానంగా దక్షిణ అమెరికా దేశాలు కొన్ని భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ఈ మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి తమ ప్రతినిధులను కూడా ఆ దేశాలు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ శాఖతో ఇప్పటికే చర్చలు జరుపుతున్న కొన్ని దేశాలు త్వరలోనే నేరుగా ఆరోగ్య శాఖ మంత్రి తో కూడా కలిసి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. కొన్ని ఫార్మా కంపెనీలు నిధులు ఉంటే దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
కొన్ని దేశాల్లో పరిస్థితుల ఆధారంగా చూస్తే కరోనా తీవ్రస్థాయిలో ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా వరకు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి కొన్ని దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కొన్ని దేశాల విషయంలో కాస్త జాగ్రత్తగానే ముందడుగు వేస్తున్నారు. భారత్ లో కూడా వ్యాక్సిన్ తయారీకి నిధుల కొరత ఉన్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి సహకారం వస్తే మాత్రం కచ్చితంగా తయారీని వేగవంతం చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. మన దేశంలో కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాలి అంటే నిధుల కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మోడీ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.